ప్రపంచంలో అత్యధిక మంది ప్రజలు వాడే యాప్‌గా వాట్సాప్ ప్రాచుర్యం పొందింది.దీనిని వివిధ దేశాల్లో మొత్తం 200ల కోట్ల మంది యూజర్లు వినియోగిస్తున్నారు.
దీంతో ఎప్పటికప్పుడు తన యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సాప్ సరికొత్త ఫీచర్లను జోడిస్తోంది.దీని ద్వారా మనం ఇతరులకు ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ చేయడంతో పాటు మెసేజెస్ పంపుకోవచ్చు.
అయితే ఎప్పుడైనా డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ టచ్ చేసి, వాట్సాప్ ఓపెన్ చేసి దానిని వినియోగిస్తుంటాం.అసలు ఫోన్ ముట్టుకోకుండానే వాట్సాప్ కాల్స్, మెసేజెస్ చేయొచ్చు.

స్మార్ట్ ఫోన్ ముట్టుకోకుండానే వాట్సాప్ కాల్స్ చేయడంతో పాటు మెసేజెస్ పంపొచ్చు.మీరు Android ఫోన్ వాడుతున్నట్లయితే ముందుగా Google అసిస్టెంట్‌ను ప్రారంభించాలి.దీని కోసం ఫోన్ ఓపెన్ చేసి, సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్స్‌పై క్లిక్ చేయండి.క్రిందికి స్క్రోల్ చేసి గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌పై నొక్కండి.అది ఆపి వేసి ఉంటే, ఆన్ చేయండి.గూగుల్ అసిస్టెంట్‌ను ప్రారంభించడానికి మీరు ‘హే గూగుల్’ అని చెప్పాలి.
దీని తర్వాత, ఇప్పుడు మీ ఫోన్‌లో వాయిస్ అసిస్టెంట్‌ను ప్రేరేపించడానికి ‘హే గూగుల్’ కు కాల్ చేయండి.

తరువాత, మీరు ఒక వ్యక్తి లేదా గ్రూప్ చాట్‌కు మెసేజ్ పంపించాలని గూగుల్ అసిస్టెంట్‌ను అడగవచ్చు.కాల్ చేయమని కూడా అడగొచ్చు.అదే మీరు ఐఫోన్ వాడుతున్నట్లయితే మీ ఐఫోన్‌లో సిరిని ఉపయోగించుకోవచ్చు.
దీని కోసం సెట్టింగ్స్ లోకి వెళ్లి, సిరిపై క్లిక్ చేయండి.ఆపై ‘హే సిరి’ టోగుల్ ఆన్ చేయండి.‘Ask and use with Siri’ అని టోగుల్ ఆన్ చేయగానే, మీరు మీ ఐ ఫోన్ టచ్ చేయకుండానే వాయిస్ కమాండ్ ద్వారా వాట్సాప్ మెసేజెస్, కాల్స్ చేయొచ్చు.ఈ ట్రిక్ మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా డ్రైవింగ్ చేసే సమయంలో వాట్సాప్ ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.







