ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా హనుమాన్ సినిమా( Hanuman Movie ) హవానే కనిపిస్తోంది.ప్రశాంత్ వర్మ,( Prasanth Varma ) తేజా సజ్జా( Teja Sajja ) కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా హనుమాన్.
ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతో పాటు ప్రస్తుతం కలెక్షన్ల మోత మోగిస్తోంది.చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా వారం రోజుల్లోనే దాదాపుగా వంద కోట్ల కలెక్షన్స్ సాధించింది.
దీంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో మారు మోగిపోతోంది.భక్తిని ఎమోషనల్ గా ప్రెజెంట్ చేసిన తీరు అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చేసింది.
![Telugu Anji, Chiranjeevi, Prasanth Varma, Hanuman, Hanuman Lesson, Teja Sajja, T Telugu Anji, Chiranjeevi, Prasanth Varma, Hanuman, Hanuman Lesson, Teja Sajja, T](https://telugustop.com/wp-content/uploads/2024/01/hanuman-100-cr-lesson-to-upcoming-movies-detailsa.jpg)
ఓవర్సీస్ లో ఏకంగా మూడు మిలియన్ మార్క్ దాటడం గురించి అక్కడి ట్రేడ్ వర్గాలు షాక్ తిన్నాయి.లాభాలు ఏ స్థాయిలో ఉంటాయో ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం.అంతేకాకుండా ఈ సినిమా విషయంలో నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు కూడా ఉన్నాయి.ఇంతకీ అవేంటంటే.హీరో స్థాయి చిన్నా పెద్దా ఏదైనా కావచ్చు.కానీ అందులో ముందు కంటెంట్ ముఖ్యం.
కేవలం గ్రాఫిక్స్ వల్ల సినిమా ఆడే పనైతే చిరంజీవి అంజి( Chiranjeevi Anji Movie ) చరిత్ర సృష్టించాలి.కానీ ప్రశాంత్ వర్మ చేసి చూపించాడు.
కోడి రామకృష్ణ ( Kodi Ramakrishna ) గారంత అనుభవం లేకపోయినా ఇప్పటి ఆడియన్స్ పల్స్ మీద పట్టు సాధించాడు ప్రశాంత్ వర్మ.
![Telugu Anji, Chiranjeevi, Prasanth Varma, Hanuman, Hanuman Lesson, Teja Sajja, T Telugu Anji, Chiranjeevi, Prasanth Varma, Hanuman, Hanuman Lesson, Teja Sajja, T](https://telugustop.com/wp-content/uploads/2024/01/hanuman-100-cr-lesson-to-upcoming-movies-detailss.jpg)
బడ్జెట్ ని కంట్రోల్ లో పెడుతూనే విజువల్ ఎఫెక్ట్స్( Visual Effects ) శభాష్ అనిపించుకునేలా ఎలా వాడాలో ఒక ఉదాహరణగా నిలిచాడు.ఈ మూవీ మేకింగ్ మీద ప్రత్యేకంగా వీడియోలు, ఇంటర్వ్యూలు చేస్తే బాగుంటుందని ఫిలిం మేకర్స్ కోరుతున్నారు.ప్రేక్షకులు క్యాస్టింగ్ ని పట్టించుకుంటారనే భ్రమలను గత ఏడాది బలగం తొలగిస్తే ఇప్పుడు హనుమాన్ దాన్ని బలపరిచింది.
రెండు సినిమాల్లో మాట్లాడింది కథా కథనాలే తప్ప హీరోలు కాదు.సంగీతం విషయంలో తీసుకోవాల్సిన శ్రద్ధ కూడా ప్రశాంత్ వర్మ టేస్ట్ లో కనిపించింది.సగటు జనాలకు అంతగా పరిచయం లేని గౌర హరితో గూస్ బంప్స్ వచ్చేలా బీజీఎమ్ రాబట్టుకోవడం చిన్న విషయం కాదు.మొత్తానికి ఈ సినిమా గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తెగ మాట్లాడుకుంటున్నారు.
అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.