ఆనంద్ లాంటి ఒక మంచి సినిమా తర్వాత శేఖర్ కమ్ముల తీసే సినిమా ఎంటి అని అందరికీ ఒక క్యూరియాసిటి అయితే ఉండేది కానీ ఆయన మళ్ళీ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీశాడు అదే గోదావరి… పవన్ కళ్యాణ్ తో ‘తొలిప్రేమ’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాని నిర్మించిన జి.వి.జి రాజు ఈ చిత్రానికి నిర్మాత.2006 వ సంవత్సరం మే 19న ఈ చిత్రం విడుదలయ్యింది… ‘పోకిరి’ వంటి పెద్ద సినిమాల నడుమ విడుదలైన ఈ చిత్రం సైలెంట్ గా హిట్టు కొట్టేసింది.ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రానికి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ లభించింది…
దీంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో బాగానే చూసారు…ఇప్పటికీ బుల్లితెరపై కూడా మిస్ కాకుండా చూస్తున్నారు.ఇది ఒక క్లాసిక్ అని చెప్పొచ్చు.
ప్రఖ్యాత ఐ.ఎం.డి.బి లో ఈ చిత్రానికి 7.9/ 10 రేటింగ్ ఉండటం అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాలి.నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 17 ఏళ్ళు పూర్తి కావస్తోంది.అందుకే ‘#17Years for godhavari అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది…
హీరో సుమంత్ కూడా ( Sumanth ) ఈ చిత్రం పోస్టర్ ను పోస్ట్ చేసి ‘ఈరోజుతో 17’ అంటూ రాసుకొచ్చాడు.ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.కె.ఎం.రాధాకృష్ణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.ఇదిలా ఉండగా.
‘గోదావరి’ చిత్రానికి హీరోగా ఫస్ట్ ఛాయిస్ సుమంత్ కాదట.ఓ స్టార్ హీరో బిజీగా ఉండి ఈ ప్రాజెక్ట్ చేయలేకపోవడంతో సుమంత్ ను తీసుకున్నాడట శేఖర్ కమ్ముల.‘గోదావరి’ ని మిస్ చేసుకున్న హీరో మరెవరో కాదు రవితేజ…
అవును ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ సినిమా చూసినప్పుడు ‘గోదావరి’ కథకి రవితేజ అయితే బాగుంటాడు అని దర్శకుడు శేఖర్ కమ్ముల అనుకున్నాడట.కానీ రవితేజ కాల్ షీట్లు బిజీగా ఉండటంతో సుమంత్ ను ఫైనల్ చేశాడు.రవితేజ( Ravi Teja ) ఏమో కానీ.సుమంత్ మాత్రం ‘గోదావరి’( Godavari ) కి మంచి ఆప్షన్ అనిపించాడు.ఈ సినిమాలో అతను చాలా బాగా నటించాడు.రవితేజ నే కాకుండా శేఖర్ కమ్ముల ఈ సినిమా పవన్ కళ్యాణ్ తో చేద్దామా అని కూడా అనుకున్నాడట కానీ పవన్ కళ్యాణ్ కి అప్పుడు ఉన్న సినిమా లైనప్ లను చూసి భయపడిపోయి కామ్ గా సుమంత్ తో చేశాడు…
.