భారత్ వైపు తొంగి చూస్తున్న గ్లోబల్ కంపెనీలు.. కారణమిదే!

కరోనా సమయంలో చాలా రంగాలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాయి.అందులో ప్రధానమైనవి భారత ఆటోమొబైల్ కంపెనీలు.

 Global Companies Looking Towards India This Is The Reason, Indian, Seeing, Globa-TeluguStop.com

దీంతో భారత్ లో సెమీ కండక్టర్ చిప్ తయారు చేయాలని కొన్ని కంపెనీలు నిర్ణయం తీసుకొని ముందుకు రావడం కొసమెరుపు.దీంతో ప్రధాన గ్లోబల్ సెమీకండక్టర్ కంపెనీలు భారత్ లోని ప్రతిష్టాత్మక సెమీకండక్టర్ ప్రోగ్రామ్‌పై ఆసక్తిని చూపించాయి.

సమీప భవిష్యత్తులో అధికారికంగా ఆసక్తిని వ్యక్తం చేసే అవకాశం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు.దీనికి సంబంధించి వచ్చే వారంలోగా ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Telugu Indian-Telugu NRI

ఈ క్రమంలో… గ్లోబల్ సెమీకండక్టర్ కంపెనీలను( Global semiconductor companies ) ఆకర్షించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇచ్చాయి.ఇదే విషయమై కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్( Ashwini Vaishnav ), సిలికాన్ వ్యాలీలో 3 రోజుల పర్యటనలో సెమీకండక్టర్ స్పేస్‌లో 60కి పైగా కంపెనీలతో సమావేశం కావడం జరిగింది.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… “భారతదేశం సెమీకండక్టర్ ప్రోగ్రామ్‌పై చాలా నమ్మకం వుంది.మొత్తం పర్యావరణ వ్యవస్థ భారతదేశానికి రావాలని కోరుకుంటోంది” అని రైల్వే మంత్రి వైష్ణవ్ ఈ సందర్భంగా అన్నారు.

Telugu Indian-Telugu NRI

బ్లూమ్‌బెర్గ్( Bloomberg ) నివేదిక ప్రకారం… సెమీకండక్టర్లను తయారు చేయడానికి పెట్టుబడులపై 50% రాయితీతో $10-బిలియన్ ఆర్థిక ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.వేదాంత-ఫాక్స్‌కాన్, ఇంటర్నేషనల్ సెమీకండక్టర్ కన్సార్టియం సింగపూర్ IGSS వెంచర్స్ ద్వారా ఈ పథకాన్ని డిసెంబర్ 2021లో ప్రకటించారు.వేదాంత రిసోర్సెస్, ప్రపంచంలోని ప్రముఖ కాంట్రాక్ట్ తయారీదారు ఫాక్స్‌కాన్‌తో జాయింట్ వెంచర్‌లో, గుజరాత్‌లోని ధోలేరాలో $20 బిలియన్ల పెట్టుబడితో డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ యూనిట్, ఇంటిగ్రేటెడ్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ మరియు అవుట్‌సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube