తెలుగులో తక్కువ సినిమాలతోనే ప్రముఖ నటి జెనీలియా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.జెనీలియా సోషల్ మీడియాలో సైతం తెగ యాక్టివ్ గా ఉంటారు.
పెళ్లికి ముందు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ పెళ్లి తర్వాత మాత్రం పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండటం గమనార్హం.హిందీలో సూపర్ డాన్సర్ చాప్టర్ 4 అనే షో ప్రసారమవుతుండగా జెనీలియా తన పెళ్లి గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
పెళ్లిలో తన భర్త రితేష్ దేశ్ ముఖ్ తన కాళ్లు పట్టుకున్నారని జెనీలియా తన పెళ్లి ముచ్చట్లను చెప్పుకొచ్చారు.డ్యాన్స్ షోలో అనీష్ అనే కంటెస్టెంట్ డ్యాన్స్ పర్ఫామెన్స్ చేయగా ఆ పర్ఫామెన్స్ గురించి స్పందిస్తూ అనిష్ పర్ఫామెన్స్ తన పెళ్లిని గుర్తు చేసిందని తెలిపారు.
తాను సాంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తానని ఆమె చెప్పుకొచ్చారు.సాంప్రదాయాలు సంతోషాలతో పాటు కన్నీళ్లు కూడా కలిసి ఉన్న ఎన్నో మధుర జ్ఞాకాలను అందిస్తాని జెనీలియా తెలిపారు.
రితేష్ దేశ్ ముఖ్ వాళ్ల ఫ్యామిలీ ఆచారం ప్రకారం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిదిసార్లు తన కాళ్లను పట్టుకున్నాడని ఆమె అన్నారు.కొన్ని వారాల క్రితం వరకు ప్రముఖ నటి శిల్పాశెట్టి ఈ షోకు జడ్జిగా వ్యవహరించారు.
శిల్పా శెట్టి పలు వివాదాల్లో చిక్కుకోవడంతో కరిష్మా కపూర్ ప్రస్తుతం ఆ షోకు జడ్జిగా ఉన్నారు.గెస్ట్ లుగా జెనీలియా, రితేష్ హాజరు కాగా ప్రోమోతో జెనీలియా అంచనాలను భారీగా పెంచారు.
మరోవైపు జెనీలియాకు ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు.తెలుగులో ఈ బ్యూటీ రీఎంట్రీ ఇవ్వాలని కోరుకునే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.మరి జెనీలియా తెలుగులోకి రీఎంట్రీ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.