ఇటీవల అమెరికా వైమానిక దాడిలో ఇరాన్ ఖుద్స్ ఫోర్ష్ కమాండర్ జనరల్ ఖాసీం సులేమాని మృతి చెందిన సంగతి తెలిసిందే.అతని అంత్యక్రియలు అశేష జనవాహిని మధ్య సోమవారం ఘనంగా ముగిశాయి.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాల తో అమెరికా బలగాలు బాగ్దాద్ విమానాశ్రయం పై వైమానిక దాడి చేసిన విషయం తెలిసిందే.ఈ ఘటనలో సులేమానీ తో పాటు ఇరాక్ మిలీషియా నేత అబు మహదీ అల్ ముహందీస్ సైతం చనిపోయారు.
అయితే సులేమాని అంత్యక్రియలు సోమవారం ముగియగా తన తండ్రిని చంపినా అమెరికా ను సులేమాని కుమార్తె జీనాబ్ సులేమాని హెచ్చరించింది.ట్రంప్ ఆదేశాలతోనే సులేమాని ని అంతమొందించినట్లు ధృవీకృతం అయిన తరువాత జీనాబ్ అక్కడి అధికారిక మీడియా లో మాట్లాడుతూ అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు.
తన తండ్రిని చంపిన అమెరికాకు చీకటి రోజులు దాపురించాయని హెచ్చరించిన ఆమె ‘పిచ్చి ట్రంప్… తన తండ్రి బలిదానంతో అంతా ముగిసిందని అనుకోకు’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.మరోపక్క సులేమాని ని హత్య చేయడం తో ఇరాన్ కూడా ప్రతీకార చర్యలు చేపడతామని శపధం చేసిన విషయం తెలిసిందే.
సోమవారం ఆయన అంత్యక్రియల కోసం అని తరలివచ్చిన జన సందోహం,అభిమానులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ వీధులు కిక్కిరిసిపోయాయి.
1989లో ఆధునిక ఇరాన్ వ్యవస్థాపకుడు అయతుల్లా రుహోల్లా ఖమోనీ అంత్యక్రియల తర్వాత అంత పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి జనం హాజరుకావడం విశేషం.అయితే మరోపక్క ఇరాన్ హెచ్చరికలను ట్రంప్ తిప్పి కొడుతున్నారు.తమపై దాడికి ప్రయత్నిస్తే ఇరాన్ వారసత్వ, చారిత్రక ప్రదేశాలను ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
దీంతో మరోసారి మధ్య ఆసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నట్లు అయ్యింది.