చిత్తూరు జిల్లాలో నలుగురు అమ్మాయిలు అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తుంది.ఈ మేరకు చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైందని తెలుస్తోంది.
మిస్సైన నలుగురిలో ఇద్దరు మైనర్లని పోలీసులు తెలిపారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలోనే ఇద్దరిని గుర్తించిన పోలీసులు స్టేషన్ కు తీసుకువచ్చారు.మరో ఇద్దరు అమ్మాయిల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
కాగా ఈ ఇద్దరిలో ఒకరు మైనర్ అని పోలీసులు వెల్లడించారు.