తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లనున్నారని తెలుస్తోంది.ఈ మేరకు ఒకటీ రెండు రోజుల్లో కాసాని కారెక్కనున్నారని సమాచారం.
ఈ క్రమంలోనే కాసానిని గోషామహల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలని గులాబీబాస్ కేసీఆర్ యోచనలో ఉన్నారని తెలుస్తోంది.గోషామహల్ నియోజకవర్గంలో బీసీ ఓట్లు అధికంగా ఉన్న నేపథ్యంలో కాసాని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఎంఐఎం సహకారంతో గెలవొచ్చని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే రేపు కేసీఆర్ తో కాసాని జ్ఞానేశ్వర్ భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత చేరిక అంశంపై కాసానితో ఇప్పటికే చర్చలు జరిపారని తెలుస్తోంది.
తెలంగాణ ఎన్నికల్లో పోటీకి చంద్రబాబు నో చెప్పడంతో టీడీపీకి కాసాని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.