ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొలది తెలుగుదేశం పార్టీకి( TDP ) వరుస షాక్ లు తగులుతున్నాయి.తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులు పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు.
తాజాగా నూజివీడు మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు( Muddaraboina Venkateswara Rao ) టీడీపీకి రాజీనామా చేయడం జరిగింది.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను ఇంకా వైసీపీలో ( YCP ) చేరలేదు.త్వరలోనే రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.
మీకు మీ పార్టీకి ఓ నమస్కారం అంటూ మీడియా ముఖంగా వ్యాఖ్యానించిన ఆయన పార్థసారథి( Parthasaradhi ) ఇంకా టీడీపీ కండువా కప్పుకోలేదు.
కానీ అప్పుడే నూజివీడు ఇన్చార్జిగా ప్రకటించారు అంటూ మండిపడ్డారు.ఉరిశిక్ష వేసే ముందు కోర్టులో న్యాయమూర్తి ఆఖరి కోరిక అడుగుతారు.కానీ నన్ను పార్టీ అడగలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో తాను బాధ్యతలు చేపట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి నియోజకవర్గంలో చాలా అధ్వానంగా ఉంది.నాకు బాధ్యతలు అప్పజెప్పాక ఈ పది ఏళ్ళలో పార్టీని బలపరచడం జరిగింది.
అయినా గాని వాటిని ఏమి పరిగణలోకి తీసుకోకుండా మమ్మల్ని తిట్టినా వైసీపీ వ్యక్తిని.తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు.సీఎం జగన్ ను( CM Jagan ) కలిశాను.అనుచరులతో చర్చించి త్వరలో ఏ విషయమో ప్రకటిస్తా.నన్ను రాజకీయంగా వాడుకుని వదిలేసిన వారి అంతు చూస్తా అని ముద్దరబోయిన వెంకటేశ్వరరావు హెచ్చరించడం జరిగింది.