రాత్రి నిద్రపోయే ముందు ఈ ఆహారాలు తింటే అంతే సంగతులు

ప్రతి ఒక్కరు రాత్రి సమయంలో మంచి నిద్ర పట్టాలని కోరుకుంటారు.అయితే కొంతమందికి ఎంతకీ నిద్ర పట్టదు.

 Foods To Avoid At Bedtime Details, Foods, Avoid Bedtiem, Chocolates, Cool Drinks-TeluguStop.com

అయితే మరికొంత మందికి ఆలా పడుకోగానే నిద్ర ముంచుకొచ్చేస్తుంది.అయితే నిద్ర పట్టని వారికీ కొన్ని కారణాలు ఉంటాయి.

వాటిలో ప్రధానమైనది ఆహారం.మనం తీసుకొనే ఆహారంను బట్టి నిద్ర పట్టటం ఆలస్యం అవుతుంది.

ఆహారాలను రాత్రి సమయంలో తీసుకోకుండా ఉంటే మంచి నిద్ర పడుతుంది.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

రాత్రి సమయంలో పిజ్జా లేదా బర్గర్‌ల వంటి వాటిని తినకూడదు.వాటిని తినటం వలన అవి జీర్ణం కావటానికి చాలా సమయం పడుతుంది.దాంతో కడుపులో గందరగోళంగా ఉండి తొందరగా నిద్ర పట్టదు.అలాగే వి సరిగా జీర్ణం కాకపోతే గ్యాస్,అజీర్ణం సమస్యలు వస్తాయి.

చాకోలెట్ లు కూడా ఎక్కువగా తినకూడదు.వీటిని తినటం వలన అలసట వస్తుంది.వీటిని తిని పడుకోవటం వలన బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.చాకోలెట్స్ లో ఉండే రసాయనాలు తొందరగా నిద్ర పట్టకుండా చేస్తాయి.

రాత్రి సమయంలో పీచు ఎక్కువగా ఉన్న కూరగాయలు తీసుకోకూడదు.ఇవి జీర్ణం కావటానికి ఎక్కవ సమయం పడుతుంది.దాంతో సరిగా జీర్ణం కాకా అజీర్ణం సమస్య వస్తుంది.ఇక దాంతో నిద్ర తొందరగా పట్టదు.

చాలా మంది రాత్రి సమయంలో మద్యం, కూల్‌డ్రింక్స్ వంటి కార్బొనేటెడ్ శీతల పానీయాలను సేవిస్తుంటారు.ఇవి నిద్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి.

అందువల్ల రాత్రి సమయంలో వాటి వాడకాన్ని తగ్గించాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube