రాత్రి నిద్రపోయే ముందు ఈ ఆహారాలు తింటే అంతే సంగతులు
TeluguStop.com
ప్రతి ఒక్కరు రాత్రి సమయంలో మంచి నిద్ర పట్టాలని కోరుకుంటారు.అయితే కొంతమందికి ఎంతకీ నిద్ర పట్టదు.
అయితే మరికొంత మందికి ఆలా పడుకోగానే నిద్ర ముంచుకొచ్చేస్తుంది.అయితే నిద్ర పట్టని వారికీ కొన్ని కారణాలు ఉంటాయి.
వాటిలో ప్రధానమైనది ఆహారం.మనం తీసుకొనే ఆహారంను బట్టి నిద్ర పట్టటం ఆలస్యం అవుతుంది.
ఆ ఆహారాలను రాత్రి సమయంలో తీసుకోకుండా ఉంటే మంచి నిద్ర పడుతుంది.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
రాత్రి సమయంలో పిజ్జా లేదా బర్గర్‌ల వంటి వాటిని తినకూడదు.వాటిని తినటం వలన అవి జీర్ణం కావటానికి చాలా సమయం పడుతుంది.
దాంతో కడుపులో గందరగోళంగా ఉండి తొందరగా నిద్ర పట్టదు.అలాగే వి సరిగా జీర్ణం కాకపోతే గ్యాస్,అజీర్ణం సమస్యలు వస్తాయి.
చాకోలెట్ లు కూడా ఎక్కువగా తినకూడదు.వీటిని తినటం వలన అలసట వస్తుంది.
వీటిని తిని పడుకోవటం వలన బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.చాకోలెట్స్ లో ఉండే రసాయనాలు తొందరగా నిద్ర పట్టకుండా చేస్తాయి.
"""/"/
రాత్రి సమయంలో పీచు ఎక్కువగా ఉన్న కూరగాయలు తీసుకోకూడదు.ఇవి జీర్ణం కావటానికి ఎక్కవ సమయం పడుతుంది.
దాంతో సరిగా జీర్ణం కాకా అజీర్ణం సమస్య వస్తుంది.ఇక దాంతో నిద్ర తొందరగా పట్టదు.
చాలా మంది రాత్రి సమయంలో మద్యం, కూల్‌డ్రింక్స్ వంటి కార్బొనేటెడ్ శీతల పానీయాలను సేవిస్తుంటారు.
ఇవి నిద్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి.అందువల్ల రాత్రి సమయంలో వాటి వాడకాన్ని తగ్గించాలి.
శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడా..?