Dark Circles : నిత్యం ఈ సింపుల్ చిట్కాను పాటించారంటే వారం రోజుల్లో డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి!

మనలో చాలా మంది చాలా కామన్ గా ఫేస్ చేసే సమస్యలు డార్క్ సర్కిల్స్( Dark Circles ) ఒకటి.అయితే డార్క్ సర్కిల్స్ ఏర్పడడానికి అందరిలోనూ ఒకే రకమైన కారణాలు ఉండవు.

 Following This Simple Tip Regularly Will Dark Circles Go Away-TeluguStop.com

రక్తహీనత, అలసట, కళ్ళను తరచూ రుద్దడం, నిద్రను నిర్లక్ష్యం చేయడం, ఎండల్లో ఎక్కువగా తిరగడం, ఒత్తిడి( Stress ), డీహైడ్రేషన్ తదితర అంశాలు డార్క్ సర్కిల్స్ ఏర్పడడానికి కారణం అవుతుంటాయి.డార్క్ సర్కిల్స్ ముఖంలో మెరుపును దూరం చేస్తాయి.

మనల్ని కాంతిహీనంగా చూపిస్తాయి.అందుకే డార్క్ సర్కస్ ను దూరం చేసుకోవడానికి తంటాలు పడుతుంటారు.

అయితే కొంద‌రికి డార్క్ సర్కిల్స్ ను నివారించుకోవడం పెద్ద సవాలుగా మారుతుంటుంది.అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే చిట్కా( Home Remedy ) బాగా హెల్ప్ అవుతుంది.

నిత్యం ఈ సింపుల్ చిట్కాను పాటించారంటే వారం రోజుల్లో డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.

Telugu Tips, Dark Circles, Darkcircles, Remedy, Simple Tip, Skin Care, Skin Care

ముందుగా బాగా పండిన ఒక టమాటో ని తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసుకుని ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ టమాటో ప్యూరీ( Tomato Puree ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ), వన్ టేబుల్ స్పూన్ రోజ్‌ వాటర్( Rose Water ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.ఆపై మరో పది నిమిషాల పాటు కళ్ళు మూసుకొని మంచిగా విశ్రాంతి తీసుకోండి.

చివరిగా వాటర్ తో శుభ్రంగా కళ్ళను క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్ గా కనుక చేశారంటే కళ్ళ చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలు చాలా త్వరగా తగ్గుముఖం పడతాయి.

డార్క్ సర్కిల్స్ తో బాధపడుతున్న వారికి ఈ రెమెడీ ది బెస్ట్ వన్( Best Remedy ) గా చెప్పుకోవచ్చు.

Telugu Tips, Dark Circles, Darkcircles, Remedy, Simple Tip, Skin Care, Skin Care

పైగా ఈ రెమెడీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.అలాగే ఈ రెమెడీని ఫాలో అవ్వడంతో పాటు బాడీని హైడ్రేటెడ్‌( Hydrated ) గా ఉంచుకోండి.కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.

స్క్రీన్ టైమ్ తగ్గించండి.స్మోకింగ్ అలవాటు( Smoking ) తప్పకుండా వదిలిపెట్టండి.

ఇక డైట్ లో పోషకాహారం ఉండేలా చూసుకోండి.ఈ చిన్న చిన్న మార్పుల వల్ల డార్క్ సర్కిల్స్ పోవడమే కాదు చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

మీ స్కిన్ గ్లోయింగ్ గా మెరుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube