కొత్తిమీర( Coriander ) గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.చికెన్, మటన్, ఫిష్ ఇలా నాన్ వెజ్ ఏది వాడినా సరే చివర్లో కొత్తిమీర పడాల్సిందే.
అలాగే బిర్యానీచ పులావ్ వంటి స్పెషల్ రైస్ ఐటమ్స్ లో కూడా కొత్తిమీరను వాడతారు.ఆహారానికి చక్కని రుచి ఫ్లేవర్ ను అందించడానికి కొత్తిమీర చాలా బాగా సహాయపడుతుంది.
అంతేనా అనుకుంటే పొరపాటే.కొత్తిమీర ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
ముఖ్యంగా పచ్చి కొత్తిమీర తినడం వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలను పొందుతారు.మరి ఇంకెందుకు ఆలస్యం కొత్తిమీరను పచ్చిగా తినడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చో తెలుసుకుందాం పదండి.
కంటి ఆరోగ్యానికి కొత్తిమీర అండగా ఉంటుంది.ముఖ్యంగా నిత్యం ఐదారు కొత్తమీర ఆకులను పచ్చిగా తీసుకుంటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
కొత్తిమీర ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ మరియు కెరోటినాయిడ్స్ అద్భుతమైన మొత్తంలో ఉంటాయి.ఇవి మంచి దృష్టిని ప్రోత్సహించడంలో సహాయపడతాయి.

అలాగే పచ్చి కొత్తిమీరను తినడం వల్ల.అందులో ఉండే కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం మరియు ఫాస్పరస్ వంటి పోషకాలు ఎముకలను దృఢంగా( Strong Bones ) మారుస్తాయి.మోకాళ్లు, కీళ్ల నొప్పల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి.సమృద్ధిగా కలిగి ఉండే ఖనిజాలు పుష్కలంగా కలిగి ఉంటాయి.
కొత్తిమీరలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫంక్షన్ ఎముకలను ఆర్థరైటిస్ సంబంధిత నొప్పి నుంచి కూడా రక్షిస్తుంది.పచ్చి కొత్తిమీర రోగనిరోధక శక్తిని( Immunity System ) క్రమంగా మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఇటీవల కాలంలో చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు.అలాంటి వారు రోజూ ఉదయాన్నే పచ్చి కొత్తిమీరను తింటే చాలా మంచిది.

కొత్తిమీరలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది.ఇది రక్తంలో చక్కెర స్థాయిలను( Sugar Levels ) తగ్గిస్తుంది.అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో( Bad Cholestrol ) బాధపడుతున్న వారు పచ్చి కొత్తిమీరను క్రమం తప్పకుండా తీసుకోండి.ఇలా చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఇక పచ్చి కొత్తిమీరను తినడం వల్ల చర్మం సైతం నిగారింపుగా మెరిసిపోతుంది.
కొత్తిమీరలో ఉండే ఐరన్, విటమిన్ ఇ మరియు విటమిన్ ఎ చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి.చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
అయితే మంచిది కదా అని పచ్చి కొత్తిమీరను అతిగా తీసుకుంటే లేనిపోని సమస్యలు వస్తాయి జాగ్రత్త.