2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అప్పుడే అమెరికాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఆశావహులంతా అధ్యక్ష బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు( Donald Trumps ) ఇప్పటికే తాము అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.వీరితో పాటు డెమొక్రాటిక్, రిపబ్లిక్ పార్టీలలో( Democratic ,Republic parties ) వున్న కొందరు ప్రముఖులు కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా.
ఇంకొందరు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు.రిపబ్లికన్ పార్టీలో కీలక నేతగా వున్న, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ కూడా అధ్యక్ష బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.
అందరూ అనుకున్నట్లుగానే రిపబ్లికన్‌లలో ట్రంప్ కంటే డిసాంటిస్‌కు ప్రజల ఆమోదం ఎక్కువగా వున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.తాజాగా విడుదలైన కొత్త పోల్ సర్వేలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై డొనాల్డ్ ట్రంప్ కంటే రాన్ డిసాంటిస్ మెరుగ్గా వున్నారట.‘‘ DailyMail.com/J.L.Partners survey’’ ప్రకారం.బైడెన్ కంటే డిసాంటిస్ 1.3 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు.జోకు 43 శాతం ఓట్లు రాగా.
రాన్ డిసాంటిస్‌కు 44 శాతం ఓటింగ్ లభించిందని సర్వే పేర్కొంది.
మరోవైపు అధ్యక్ష బరిలో పాల్గొంటున్నట్లు రాన్ డిసాంటిస్ ప్రకటించిన రెండు వారాల్లో అతని రేటింగ్ పడిపోయిందని ఇటీవల మరో సర్వే తెలిపింది.ఆన్‌లైన్ పోలింగ్ సంస్థ ‘‘ Civiqs ’’ ప్రకారం.రేటింగ్ గ్రాఫ్‌లో డిసాంటిస్‌కు 19 శాతం ప్రతికూల ఓటింగ్ వుందట.55 శాతం మంది అతనిని తిరస్కరించగా.36 శాతం మంది అతనికి మద్ధతుగా నిలిచారు.18 నుంచి 34 ఏళ్ల లోపు వాళ్లు 63 శాతం, మహిళలు 62 శాతం, ఆఫ్రికన్ అమెరికన్లు 85 శాతం, హిస్సానిక్ / లాటినో జనాభా 68 శాతం మంది డిసాంటిస్‌కు అనుకూలంగా వున్నారని ‘‘Newsweek’’ సర్వే వెల్లడించింది.
కాగా.రాయిటర్స్ – ఇప్సోస్ ( Reuters – Ipsos )పోల్ ప్రకారం.2024 రిపబ్లికన్ ప్రైమరీలో యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో వున్నారట.అయితే డిసాంటిస్‌కు పార్టీలో వున్న ఆదరణ దృష్ట్యా ట్రంప్‌కు ఆయన గట్టి పోటీ ఇస్తారని విశ్లేషకులు చెబుతున్నారు.అంతేకాకుండా ట్రంప్ నిధుల సేకరణ కార్యక్రమానికి కూడా డిసాంటిస్ ముప్పుగా మారే అవకాశాలు లేకపోలేదంటున్నారు.