తొలిసారిగా రెండు వేర్వేరు సంవత్సరాల్లో పుట్టిన కవలలు... అదెలాగంటే?

సాధారణంగా కవల పిల్లలు ఒకే రోజు ఒకే సమయంలో పుడతారు.కానీ అమెరికాలో కవల పిల్లలు ఏకంగా రెండు వేర్వేరు సంవత్సరాల్లో పుట్టారు.

 First Time Two Twins Born In Different Years How Details, Twins,born, Latest Ne-TeluguStop.com

రెండు వేరువేరు సంవత్సరాల్లో పుట్టినప్పుడు వాళ్లు కవల పిల్లలు ఎలా అవుతారు అనే సందేహం మీలో కలగక మానదు.అయితే ఇది ఒక తల్లికి మాత్రం సాధ్యమయింది.

అదెలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.అమెరికాలోని కాలిఫోర్నియాలో గ్రీన్‌ఫీల్డ్‌ సిటీ లో నివసించే ఫాతిమా మాడ్రిగల్‌కు డిసెంబర్ 31న పురిటి నొప్పులు వచ్చాయి.

దాంతో ఆమెను హుటాహుటిన నాటివిడాడ్ మెడికల్ సెంటర్ అనే ఓ స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు.

అయితే ఫాతిమా 31వ తేదీన సరిగ్గా 11.45 గంటలకు ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది.15 నిమిషాల తర్వాత అంటే సరిగ్గా జనవరి 1, 2022న అర్ధరాత్రి 12 గంటలకు ఆమె ఒక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.దీంతో 2021లో మగబిడ్డ జన్మించినట్లుగా.ఆడబిడ్డ 2022లో జన్మించినట్లుగా తేదీలు మారిపోయాయి.ఒకేసారి పావుగంట వ్యవధితో పుట్టిన కవలలు ఇలా వేర్వేరు సంవత్సరాల్లో పుట్టిన రోజులు జరుపుకునేలా తేదీలు మారడంతో ఫాతిమా సంతోషిస్తుంది.ఈ అరుదైన సంఘటన గురించి స్థానిక ఆస్పత్రి సోషల్ మీడియాలో వెల్లడించింది.

తల్లి, కవల బిడ్డల ఫొటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేసి తల్లీబిడ్డలు క్షేమమని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Telugu America, Born, Calinia, Dates, Fathima, Time, Latest, Twins-Latest News -

ఆల్ఫ్రెడో అని మగ శిశువుకు, ఐలిన్‌ అని ఆడశిశువుకు నామకరణం చేశామని తల్లి ఫాతిమా, తండ్రి రాబర్ట్ ట్రుజిల్లో పేర్కొన్నారు.ఈ ఇద్దరు పిల్లలు రెండు వేర్వేరు బర్త్ డేలతో రికార్డు సృష్టించారు.‘నా కవల పిల్లలు వేర్వేరు పుట్టినరోజులు కలిగి ఉండటం అద్భుతంగా ఉంది’ అని తల్లి ఫాతిమా తాజాగా మీడియాకు వెల్లడించారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో తల్లీబిడ్డలు ఫొటోలు వైరల్ గా మారాయి.ఈ అరుదైన ఘటన గురించి తెలుసుకొని చాలామంది ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube