ఎట్టకేలకు 'రుణ పరిమితి పెంపు' చట్టంపై సంతకం చేసిన బైడెన్!

అవును, ఎట్టకేలకు అమెరికా దేశాధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) అక్కడ రుణ పరిమితిని ఎత్తివేసే చట్టంపై సంతకం చేయడం జరిగింది.ఈ విషయమై డెమొక్రాటిక్, రిపబ్లికన్ నాయకుల పరస్పర భాగస్వామ్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ.

 Finally, Biden Signed The 'debt Limit Increase' Law, America, Us President, Joe-TeluguStop.com

బైడెన్ ఓ సంక్షిప్త ప్రకటన ఒకటి విడుదల చేశారు.సోమవారం నుంచి అమెరికాలో నగదు కొరత ఏర్పడుతుందని, అది అమెరికాతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తుందని అంతకుముందు ట్రెజరీ డిపార్ట్‌మెంట్ హెచ్చరించిన సంగతి అందరికీ తెల్సిందే.

ఈ నేపథ్యంలోనే బైడెన్ రుణ పరిమితిని ఎత్తివేసే చట్టంపై సంతకం చేసినట్టు తెలుస్తోంది.

Telugu America, Debt Limit Law, International, Joe Biden-Telugu NRI

ఇకపోతే 2021 నాటికి అమెరికా ప్రభుత్వం​ తీసుకున్న అప్పు 28.5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.అది మన రూపాయలలో రూ.23,53,09,680 కోట్లు ఉంటుంది.ఇది అమెరికా జీడీపీ( US GDP ) కంటే 24 శాతం ఎక్కువ అని చెప్పుకోవాలి.

ఇందులో ఎక్కువ మొత్తం దేశీయంగా వ్యక్తులు, సంస్థల నుంచి సేకరించింది కాగా దాదాపు 7 లక్షల కోట్ల డాలర్లను విదేశాల నుంచి సేకరించడం జరిగింది.ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ​ అప్పుల పరిమితి 31.4 లక్షల కోట్ల డాలర్లు.ఈ పరిమితిని సైతం దాటి అప్పులు చేసేందుకు బైడెన్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌( Congress ) అనుమతి కోరగా సంఖ్యాపరంగా ఆధిక్యంలో ఉన్న రిపబ్లికన్లు.

అప్పు పరిమితి పెంచేందుకు ససేమిరా అన్నారు.దీంతో అక్కడ గతకొంత కాలంగా కాస్త ఆందోళన నెలకొంది.

Telugu America, Debt Limit Law, International, Joe Biden-Telugu NRI

ఆ తరువాత పరిస్థితిని అర్ధం చేసుకున్న వారంతా ఓ ఒప్పందానికి వచ్చి.ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు.ఫలితంగా 314- 117 ఓట్ల తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందింది.చెల్లింపుల కోసం అమెరికా ప్రభుత్వం​ తీసుకునే రుణాలపై విధించిన గరిష్ఠ పరిమితినే ‘డెట్‌ సీలింగ్‌’( Debt Ceiling ) అంటారు.

అంటే ఈ పరిమితికి మించి ప్రభుత్వం అప్పులు తీసుకునేందుకు వీలులేదు.ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ​ అప్పుల పరిమితి 31.4 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది.అంటే ప్రభుత్వ అప్పుల మొత్తం.

ఇంత మొత్తాన్ని మించడానికి వీలులేదన్నమాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube