ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో తన్నుకున్న ప్యాసింజర్లు.. షాకింగ్ వీడియో వైరల్...

తాజాగా ఢిల్లీ మెట్రో కోచ్‌( Delhi Metro )లో ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు భౌతిక దాడి చేసుకున్నారు.వీరి మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 Fight Takes Place Between Passengers Inside Delhi Metro Coach,delhi Metro, Fight-TeluguStop.com

రద్దీగా ఉండే రైలులో ఈ సంఘటన జరిగింది, ఒక వ్యక్తి తనను తోసినట్లు ఆరోపిస్తూ వృద్ధ ప్రయాణికుడిపై దాడి చేశాడు.ఆ వృద్ధ వ్యక్తి తిరిగి ఒక తన్ను తన్నాడు.

మరో వ్యక్తి గొడవకు దిగి వృద్ధుడి వెంట్రుకలను లాగాడు, మరికొందరు ప్రయాణికులు పోరాటాన్ని ఆపడానికి ప్రయత్నించారు.మైక్రోబ్లాగింగ్ సైట్ అయిన ఎక్స్‌లో @gharkekalesh అనే వినియోగదారు ఈ వీడియో పోస్ట్ చేశారు.

అతను వీడియోకు “టూ మ్యాన్ ఇన్‌సైడ్ ఢిల్లీ మెట్రో ఓవర్ పుష్ అండ్ షవ్ ఇన్ క్రౌడ్” అని క్యాప్షన్ ఇచ్చాడు.ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, వేలల్లో లైకులు వచ్చాయి.

ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు తన్నుకోవడం, కొట్టుకోవడం, దూషించే పదజాలం ఉపయోగించడం మనం చూడవచ్చు.వారిద్దరినీ శాంతించమని ఇతర ప్రయాణికుల( Passengers ) విజ్ఞప్తి చేస్తుండటం కూడా గమనించవచ్చు అయినా ఆ ఇద్దరు వ్యక్తులు పట్టించుకోకుండా అలానే గొడవపడ్డారు. రైలు నెక్స్ట్ స్టేషన్‌కు చేరుకునే వరకు కొన్ని నిమిషాల పాటు పోట్లాట కొనసాగింది.గొడవ ప్రారంభించిన వ్యక్తి ఇతర ప్రయాణికులను, వృద్ధుడిని తిట్టుకుంటూ రైలు దిగిపోయాడు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు( Netizens ) బాగా మండిపడ్డారు.కొట్లాడుకున్న ఆ ఇద్దరు ప్యాసింజర్ల ప్రవర్తనపై తమ దిగ్భ్రాంతిని, అసహ్యం వ్యక్తం చేశారు.మరికొందరు జోకులు పేల్చారు.“ఢిల్లీ మెట్రో 2023కి బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డును అందుకుంది” అని ఒక నెటిజన్ సరదాగా వ్యాఖ్యానించాడు.మరి కొంతమంది మాత్రం వరల్డ్ క్లాసు మెట్రోలో థర్డ్ క్లాస్ పీపుల్ ఎక్కి దాని పరువు తీస్తున్నారని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube