టిఆర్ఎస్ ను వీడి బీజేపీలు చేరిన వెంటనే ఉప ఎన్నికలకు వెళ్లి బీజేపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు బీజేపీలు మొదట్లో ఎక్కువగా ప్రాధాన్యం కనిపించేది. తెలంగాణ కి రాబోయే రోజుల్లో ఆయనే పెద్ద దిక్కుగా మారతారు అని, అలాగే 2023 ఎన్నికల్లో విజయం సాధిస్తే ముఖ్యమంత్రిగా ఈటెల రాజేందర్ కు అవకాశం ఇస్తారని అంత అంచనా వేశారు.
దీనికి తగ్గట్లుగానే రాజేందర్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ బీజేపీ అగ్రనేతలు ఆయన ను ప్రోత్సహించారు.అయితే ఇప్పుడు రాజేందర్ ప్రభావం బీజేపీలో బాగా తగ్గిపోయింది.
పూర్తిగా సైలెంట్ అయిపోయారు.బీజేపీ అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకోనట్లు గానే వ్యవహరిస్తోంది.
దీనికి అనేక కారణాలు ఉన్నాయి.ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన సమయంలో ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ వంటి వారితో పాటు , వందల మంది ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులు బీజేపీ కండువా కప్పుకున్నారు.
ఇంకా వేలాది మందిని బీజేపీ లో చేర్చి తన సత్తా చాటుకోవాలని రాజేందర్ భావించారు.ఆయన ఉప ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జిల్లాలో పర్యటనలు చేపట్టడమే కాక, అనేక సమావేశాలు నిర్వహించడం, సొంత సామాజిక వర్గం వారితో అనేక చోట్ల సన్మానాలు చేయించుకోవడం, రాబోయే రోజుల్లో బీజేపీకి తానే కీలకం అనే సంకేతాలను ఇవ్వడం వంటి వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.
రాజేందర్ విషయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నా, సైలెంట్ గానే ఉంటూ వచ్చారు.తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 317 విషయంలో ఎప్పుడైతే బండి సంజయ్ గట్టిగా పోరాటం మొదలు పెట్టారో, టిఆర్ఎస్ కూడా సంజయ్ ప్రభావాన్ని పెంచేందుకు ఈటెల రాజేందర్ ప్రభావాన్ని తగ్గించేందుకు ఎక్కువగా ప్రయత్నించింది.ఈ మేరకు బండి సంజయ్ ను అరెస్టు చేయించడం వంటి వ్యవహారాలకు పాల్పడడం వంటి చర్యలతో సంజయ్ పేరు మారుమోగింది. ఇక ఈటెల రాజేందర్ మొదట్లో చెప్పినట్లుగా పెద్దగా పార్టీలో చేరికలను ప్రోత్సహించ లేకపోవడం, రాజేందర్ వెంట వచ్చిన వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా లేకపోవడం, వారి పరిస్థితి అయోమయంగా మారడం, అధిష్టానం కూడా రాజేందర్ పై మొదట్లో ఉన్న అంత సానుకూల ధోరణితో ప్రస్తుతం అం లేకపోవడం ఇవన్నీ ఆయనకు , ఆయన అనుచరులకు ఇబ్బందికరంగా మారాయి.
ఈ కారణాలతో ఆయన గత కొంత కాలంగా సైలెంట్ అయిపోయారట.