కేంద్రం పై సీరియస్ కామెంట్లు చేసిన కేటీఆర్..!!

దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కేంద్రం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ధరకు సంబంధించి కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్.

 Ktr Made Serious Comments On The Central Government Over Corona Vaccine Rates ,-TeluguStop.com

కేంద్రానికి ఒక ధర, రాష్ట్రానికి మరో ధర కేటాయించటం పట్ల విమర్శల వర్షం కురిపించారు.వన్ నేషన్ వన్ టాక్స్ అన్నారు, మరి ఇప్పుడు వ్యాక్సిన్ కి సంబంధించి.

ఒకే దేశం.రెండు ధరలు కేటాయించటం ఏంటి అని.ప్రశ్నించారు.వ్యాక్సిన్ కేంద్రానికి 150 రూపాయలు, రాష్ట్రానికి 400 రూపాయలు ఎందుకు అని సోషల్ మీడియా సాక్షిగా కేటీఆర్ నిలదీశారు.

అదనపు భారాన్ని పీఎం కేర్ నుంచి భరించవచ్చు కదా అంటూ ప్రశ్నించారు.ఇదిలా ఉంటే దేశంలో భారీ స్థాయిలో కరోనా వైరస్ కేసులు బయట పడుతూ ఉన్నాయి.

గడచిన 24 గంటల్లో మూడు లక్షలకు పైగా కేసులు ఇండియాలో నమోదు కావడంతో.ప్రపంచ దేశాలు తమ దేశ పౌరులను ఇండియా లోకి వెళ్ళకూడదు అంటూ గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

ఈ క్రమంలో దేశంలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా చేయాలని కేంద్రం .కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.ఇటువంటి పరిణామంలో వ్యాక్సిన్ విషయంలో .కేంద్రానికి ఒక ధర, రాష్ట్రాలకు మరో ధర కేటాయించటం పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని సోషల్ మీడియా వేదికగా నిలదీశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube