మాజీ మంత్రి… కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీ సీఎం చంద్రబాబు తీరు పై విరుచుకుపడ్డారు.మీరు జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారైనా నిజం చెప్పారా …? అలా నిజం చెప్పి ఉంటే ప్లీజ్ అదేమిటో తెలియచేయండి అని ఆయన కోరారు.చంద్రబాబు ఆరాటం చూస్తుంటే ఆయన తన సొంత ఆస్తులు,కుటుంబ ఆస్తులు కాపాడుకోవడానికి తంటాలు పడుతున్నట్లుగా ఉందని ఆయన అన్నారు.

‘ఏం ఘనకార్యం చేశారని మీకు రాష్ట్ర ప్రజలు అండగా ఉండాలి.అసలు గజదొంగ మీరా లేక ఇతర పార్టీ నాయకులా? అమాయక ప్రజలకు హామీలు కురిపించి మరోసారి అధికార దాహం తీర్చుకోవడం కోసం ఈ తహతహ కాదా? ఊసరవెల్లి రంగులు మార్చినట్టు ముందు బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్, రేపు మళ్లీ బీజేపీ అధికారంలోకొస్తే వారికి జై కొట్టడం చేస్తారని ముద్రగడ మండిపడ్డారు.







