2000 నోటు ఇక కనుమరుగేనా ...? ఆగిన ప్రింటింగ్ !

కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ఆకస్మాత్తుగా నోట్ల రద్దు ప్రకటించి అప్పట్లో పెను సంచలనం సృష్టించింది.ఆ స్థానంలో కొత్తరకం నోట్లను అప్పట్లో ప్రవేశపెట్టారు.1000 నోటూనే రద్దు చేస్తారు అని అంతా అనుకుంటుండగానే….2000 నోటును ప్రవేశపెట్టి అందరికి షాక్ ఇచ్చారు.అయితే ఆ 2000 నోటు గురించి కూడా… పెద్ద ఎత్తునే ప్రచారం జరిగింది.ఆ నోటులో చిప్ ఉందని… శాటిలైట్ తో కనెక్ట్ అయ్యిందని… అలా అనేక ప్రచారాలు కూడా … జరిగాయి.

 2000 Rupees Note Printing Stopped-TeluguStop.com

అయితే ఆ తరువాత అదంతా ఉత్తిదే అన్న సంగతి అందరికీ తెలిసిపోయింది.ఈ నోటుని జరీ చేసి దాదాపు రెండేళ్లు అవుతోంది.ఈ లోపునే ఆ రూ.2000 నోటు ప్రింటింగ్ ను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.

ద ప్రింట్ కథనం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రూ.2000 నోట్ల ముద్రణను నిలిపేసింది.ఈ నోటుని ప్రవేశపెట్టడంపై మోడీ సర్కార్ ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.కేంద్రం రూ.2000 పెద్ద నోటును లాంచ్ చేయడాన్ని ప్రతిపక్షాలతో పాటు ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు సైతం తీవ్రంగా విమర్శించారు.కోటక్ మహింద్ర మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ సైతం రూ.1000 నోటును రద్దుచేసి రూ.2000 నోటును జారీ చేయడం సరైన చర్య కాదని అప్పట్లోనే బహిరంగంగా విమర్శలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube