పార్టీ బలోపేతానికి కృషి చేయాలి:- సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకుడు భాగం హేమంతరావు

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడి సీపీఐ పార్టీ బలోపేతానికి కృషిచేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు పిలుపు నిచ్చారు.ఖమ్మం జిల్లా మధిరలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆఫీస్ లో సిపిఐ మధిర పట్టణ సహాయ కార్యదర్శిపెరుమలపల్లి ప్రకాష్ రావు అధ్యక్షతన జరిగిన మండల కార్యవర్గ సమావేశంలో భాగం మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు.

 Efforts Should Be Made To Strengthen The Party: - Hemant Rao Is The State Leader-TeluguStop.com

ప్రజలపై భారాలు మోపుతున్నారని అన్నారు.పెట్రోల్,డీజిల్ ధరలను పెంచారని,మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు తెచ్చి తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి పాలన చేస్తున్నారని హామీలకు సేవలకు పొంతన లేదని అన్నారు.పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహించాలన్నారు.

సిపిఐ కేంద్ర, రాష్ట్ర, జిల్లా పార్టీల నిర్ణయానికి అనుగుణంగానే పార్టీ రాజకీయ నిర్మాణ కర్తవ్యాలను అమలు చేయాలన్నారు.మండలంలో ప్రజా సంఘాలను నిర్మాణం చేసి ప్రజలకు ఆయా వర్గ ప్రజల సమస్యలపై పోరాటాలు నిర్వహించి బలోపేతం చేయాలన్నారు.

తద్వారా పార్టీ ప్రతిష్టను పెంచాలని పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు పోవాలని సమావేశంలో నిర్ణయించారు.ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్,జిల్లా కార్యవర్గ సభ్యులు జిమ్ము ల జితేందర్రెడ్డి,జిల్లా రైతు సంఘం ఆర్గనైజర్ కార్యదర్శి మందడపు రాణి,సిపిఐ మండల పట్టణ కార్యదర్శులు వుట్ల కొండలరావు,బెజవాడ రవి బాబు,మండల సహాయ కార్యదర్శి చావా మురళీకృష్ణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్, చెరుకూరిక వెంకటేశ్వర రావు తలారి రమేష్,ఎస్ కే కొండ,అన్నవరపు సత్యనారాయణ,మందడపు తేజ,చట్టు అశోక్,రంగు నాగ కృష్ణ,మంగళగిరి రామాంజనేయులు,శిరివేరు శ్రీనివాసరావు,మచ్చ వెంకటేశ్వర్లు,వుట్ల కామేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube