ప్రజా ప్రస్థానం: పెసర రైతుల పొలాలను పరిశీలించిన వై ఎస్ షర్మిల

వై యస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం 48వ రోజు వ రోజుకి చేరుకుంది.దానిలో భాగంగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం చింతల తండా నుంచి వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించారు.

 Public Presence: Ys Sharmila Inspecting The Fields Of Pesara Farmers-TeluguStop.com

అక్కడి నుంచి చేగొమ్మ‌, ఎర్ర‌గ‌డ్డ‌, కొక్కిరేణి, తిరుమ‌లాయ‌పాలెం, చింత‌ప‌ల్లి క్రాస్ మీదుగా సాగుతోంది.రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌డ్లు కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేస్తూ చేగొమ్మ‌ గ్రామంలోని రైతు వేదిక వద్ద రైతులతో కలిసి ధ‌ర్నాలో పాల్గొని మాట్లాడారు.

అనంత‌రం ఎర్ర‌గ‌డ్డ‌ గ్రామంలోని పెస‌ర రైతులతో మాట్లాడి పంట పెట్టుబ‌డి, దిగుబ‌డితో పాటు రైతులు ఎదుర్కొంటున్న‌ స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు.న‌కిలీ విత్త‌నాల‌తో మోస‌పోయామ‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అధైర్య పడవద్దని, మీ పక్షాన ప్రభుత్వాన్ని నిలదిస్తానని భరోసా కల్పించారు.సాయంత్రం తిరుమ‌లాయ‌పాలెం గ్రామంలో మాట ముచ్చ‌ట కార్య‌క్ర‌మం నిర్వహించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకోనున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube