గురుకుల లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని మరియు మెనూ అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించినటువంటి వార్డెన్ నీ దానికి సంబంధించిన ప్రిన్సిపల్స్ పై చర్యలు తీసుకోవాలని పి.డి.
యస్ యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గౌతమ్ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పి.
డి.యస్.యూ ఖమ్మం జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు అజాద్, వెంకటేష్ లు మాట్లాడుత కెజి టు పీజీ ఉచిత విద్య అంటే ST,BC,SC గురుకులలు సమస్యలు పట్టించుకోవడమేనా? కే.సి.అర్ అని ఆవేదన వ్యక్తం చేశారు…
విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మిస్ చార్జీలు పెంచకపోవడం వల్ల నాణ్యమైనటువంటి ఆహారం అందించకపోవడం వల్ల విద్యార్థులు పౌష్టిక ఆహార లోపంతో అనారోగ్యాలకు కారణమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.హాస్టల్స్ ప్రారంభమై మూడు నెలలు అవుతున్న ఇప్పటివరకు జిల్లా అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వలన మెనూ చాట్ ఏర్పాటు చేయని దీనవస్థలో ప్రభుత్వము ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో మంత్రి హరీష్ రావు గారు ఆంధ్ర విద్యార్థులకు స్కాలర్షిప్ రేయంబర్స్మెంట్ ఇవ్వము, అవసరమైతే మా తెలంగాణా విద్యార్థులకు పాకెట్ మనీ వెయ్యి రూపాయలు ఇస్తామని ప్రకటించి నేటికీ ఆరు సంవత్సరాల నాలుగు నెలలు పూర్తవుతున్న అమలు కాని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందన్నారు.
హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు 3500 రూపాయలు,కాస్మొటిక్ చార్జీలను 500, ఇంటర్ ఆపై విద్యార్థుల కు పాకెట్ మనీ 1000 రూపాయలు తక్షణమే ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రతి హాస్టల్ కు ఒక ANM ను నియమించి ఆరోగ్య పరీక్షలు ప్రతి నెల నిర్వహించి, ఫస్ట్ ఎయిడెడ్ బాక్స్ లో ఏర్పాటు చేయాలన్నారు.తక్షణమే వసతి గృహ సమస్యల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించాలని లేనియెడల దశల వారి ఆందోళనకు సిద్ధమవుతావని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు ఖమ్మం జిల్లా నాయకులు రాంబాబు , సతీష్ డివిజన్ నాయకులు కార్తీక్, మల్సూర్, కరుణ, తదితరులు పాల్గొన్నారు
.