తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి, మతాల మధ్య పోరాటంగా చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న బిజెపి పార్టీని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.మంగళవారం వైరా బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో చింతనిప్పు చలపతిరావు అధ్యక్షతన సిపిఐ(ఎం) వైరా పట్టణ సభ్యుల విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం కమ్యూనిస్టులు పోరాటం చేసి పది లక్షల ఎకరాల భూమిని రైతులకు పంపిణీ చేశారని అన్నారు.నైజాం పరిపాలనకు వ్యతిరేకంగా ముస్లింలు హిందువులు సమిష్టిగా పోరాటం, త్యాగాలు చేశారని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఇసుక రేణువంత పాత్ర కూడా బిజెపి నేడు ఉత్సవాలకు సిద్ధం కావడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
రైతాంగ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలు పరిష్కారం కోసం విస్తృతంగా ఉద్యమాలు చేయాలని సూచించారు.అనంతరం సిపిఐ(ఎం) వైరా నియోజకవర్గం ఇన్చార్జి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడినారు.
ఈ కార్యక్రమంలో వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, రూరల్ కార్యదర్శి తోట నాగేశ్వరరావు, నాయకులు బోడపట్ల రవీందర్, మల్లెంపాటి రామారావు, మచ్చా మణి, బొంతు సమత గుడిమెట్ల రజిత, గుడిమెట్ల మోహనరావు, అనుమోలు రామారావు, హరి వేంకటయ్య, కొంగర సుధాకర్, గుమ్మా నరసింహారావు, రాచబంటి బత్తిరన్న, దేవబత్తిని నరసింహారావు, తోట కృష్ణవేణి, ఓర్పు సీతారాములు, మందడపు రామారావు, బెజవాడ వీరభద్రం, కురుగుంట్ల శ్రీనివాసరావు వాసిరెడ్డి విద్యాసాగర్ రావు, షేక్ జమాల్, పాపగంటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.