పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ( BRS )పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) అన్నారు.బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ తో కమ్యూనిస్టుల కలిశారని భట్టి విక్రమార్క తెలిపారు.ఈ క్రమంలోనే మరో పార్టీ అభ్యర్థికి ఇక్కడ స్థానం లేదని చెప్పారు.
గోదావరి నీళ్లతో ఖమ్మం జిల్లా రైతుల కాళ్లు కడుగుతామని వెల్లడించారు.అబద్దాల పునాదులపై పుట్టిన బీఆర్ఎస్ రైతుబంధుపై గగ్గోలు పెడుతోందన్న డిప్యూటీ సీఎం భట్టి ఎన్నికల కోడ్ ముగియగానే ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజలు చేస్తామని తెలిపారు.