రేపు ఖమ్మం నగరంలో జరిగే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.ఈ మేరకు సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.
తనపై కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధ్వజమెత్తారు.ఎన్నికల తరువాత వారి కోసం ఖమ్మంలో పిచ్చి ఆసుపత్రి కట్టిస్తామని తెలిపారు.
తన ప్రత్యర్థి విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.ఖమ్మంలో ఇసుక మాఫియా ఎక్కడుందో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేతలు ఎంతమంది కబ్జా చేశారో తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు.కాంగ్రెస్ హయాంలో దేశమే కుప్పకూలిందని విమర్శించారు.