కాంగ్రెస్ రైతు ప్రభుత్వం.. మంత్రి తుమ్మల

అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Thummala Nageswara Rao ) అన్నారు.ఈ మేరకు తడిసిన ధాన్యాన్ని మద్ధతు ధరకు కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.

 Congress Farmer Government.. Minister Thummala ,thummala Nageswara Rao , Gove-TeluguStop.com

ఈ క్రమంలోనే రైతులు( Farmers ) ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమన్న మంత్రి తుమ్మల రైతన్నకు సర్కార్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

అదేవిధంగా పంటలకు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తుందని ఆయన వెల్లడించారు.లోక్ సభ ఎన్నికల కోడ్( Lok Sabha Election Code ) ముగిసిన తరువాత చెప్పినట్లుగా రైతు భరోసా నగదును అందజేస్తామని తెలిపారు.

విత్తనాలు, ఎరువుల కోసం క్యూ లైన్లలో వేచి చూసే పరిస్థితి రానివ్వమన్న మంత్రి తుమ్మల ఆగస్ట్ 15వ తేదీలోపు రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube