ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో గల 55వ డివిజన్ నందు స్మార్ట్ కిడ్జ్ పాఠశాల ఆధ్వర్యంలోజ్యూట్ బ్యాగులను పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు.నీరజ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు అందరూ పాటుపడాలని,పర్యావరణాన్ని కాపాడాలని వారు అన్నారు.నగరంలోని స్మార్ట్ కిడ్జ్ పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా జ్యూట్ బ్యాగులను పాఠశాల పేరిట అందించారు.
స్మార్ట్ కిడ్జ్ పాఠశాల యాజమాన్యం మంచి ఆలోచనతో “పర్యావరణ పరిరక్షణ” కోసం ప్లాస్టిక్ కవర్లను నిషేధించి జ్యూట్ బ్యాగులను విద్యార్థులకు తల్లిదండ్రులకు అందజేయడం శుభపరిణామం.అందరూ ఆదర్శంగా తీసుకోవాలని,ప్లాస్టిక్ కవర్లు వాడటం వల్ల తీవ్రమైన నష్టం జరుగుతుందని, ప్లాస్టిక్ వాడకం వల్ల భూమి మీద వ్యర్ధాలు పెరిగిపోతున్నాయని తద్వారా మట్టి కాలుష్యం నీటి కాలుష్యం,వివిధ రూపాల్లో ప్రభావం చూపుతున్నాయని, విద్యార్థులు పర్యావరణంపై అవగాహన కలిగి ఉండి దాన్ని కాపాడాల్సిన బాధ్యతను కూడా తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా,55,56 డివిజన్ కార్పొరేటర్లు ,మోతారపు శ్రావణి సుధాకర్ ,పైడిపల్లి సత్యనారాయణ రోహిణి , పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య, డైరెక్టెర్ సుకన్య తదితరులు పాల్గొని విద్యార్థుల తల్లిదండ్రులకు జ్యూట్ బ్యాగులను అందజేశారు.ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.