బాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్లను అమ్ముకుంటోందా.. ఆయన కామెంట్లు నిజమేనా?

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతున్న సినిమాలతో పోల్చి చూస్తే ఫ్లాప్ అవుతున్న సినిమాలే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.సౌత్ సినిమాలు హిందీలో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తుంటే హిందీ సినిమాలు మాత్రం భాషతో సంబంధం లేకుండా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంటూ ఉండటం గమనార్హం.

 Anupam Kher Shocking Comments About Bollywood Industry Goes Viral In Social Medi-TeluguStop.com

ప్రముఖ బాలీవుడ్ నటులలో ఒకరైన అనుపమ్ ఖేర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ స్టార్లకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సౌత్ ఇండస్ట్రీ మంచి కథలను నమ్ముకుని సినిమాలను తీస్తోందని బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం హీరోలను అమ్ముకునే ఆలోచనలో ఉందని ఆయన అన్నారు.

ఈ రీజన్ వల్లే హిందీ సినిమాలకు ఆదరణ తగ్గిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు.ఈ రీజన్ వల్లే సౌత్ సినిమాలు సక్సెస్ సాధిస్తుంటే బాలీవుడ్ ఇండస్ట్రీ డీలా పడుతోందని ఆయన చెప్పుకొచ్చారు.

మనం వినియోగదారుల కోసం వస్తువులను తయరు చేస్తున్నామని అనుకుంటే మనం వినియోగదారులను ఎప్పుడైతే చిన్నచూపు చూస్తామో అప్పుడే సమస్య మొదలవుతుందని ఆయన తెలిపారు.

మేము ఒక గొప్ప సినిమాను చేయడం వల్ల మీరు లాభం పొందుతున్నారని మీరు ఒక గొప్ప సినిమాను చూస్తారని అనుకోవడం తప్పని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Anupam Kher, Bollywood-Movie

సమిష్టి కృషితో మాత్రమే గొప్పదనం సాధ్యమవుతుందని ఆయన కామెంట్లు చేశారు.తెలుగులో పని చేయడం ద్వారా ఈ విషయం నేర్చుకున్నానని ఆయన తెలిపారు.దక్షిణాదిలో ఏ రెండు ఇండస్ట్రీల మధ్య తేడా చూడలేదని ఆయన చెప్పుకొచ్చారు.

సౌత్ ఇండస్ట్రీ వాళ్లు కథను నమ్ముకుంటారు తప్ప హాలీవుడ్ ను ఇష్టపడరని ఆయన తెలిపారు.

బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం స్టార్లను అమ్ముతోందని ఆయన వెల్లడించారు.అనుపమ్ ఖేర్ చేసిన కామెంట్ల గురించి బాలీవుడ్ సినీ ప్రముఖులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube