ఖమ్మం మిర్చి యార్డు( Khammam Mirchi yard )లో రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.మిర్చికి ధర భారీగా తగ్గించడంతో రైతులు నిరసనకు దిగారు.
దీంతో వ్యాపారులకు, రైతులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.వ్యాపారులు కావాలనే తక్కువ ధర అడుగుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.క్వింటా మిర్చికి రూ.6 వేలు తగ్గించడం ఏంటని వాపోతున్నారు.
గతంలో వ్యాపారులను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Thummala Nageswara Rao ) హెచ్చరించినా ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు.ఆరుగాలం శ్రమించి సాగు చేస్తున్న తమకు పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు