కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించడంలో ఘోరంగా విఫలం అయ్యాయని పి వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ వి రాకేష్ అన్నారు
స్థానిక ఖమ్మం కామ్రేడ్ రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో పి వై ఎల్ నగర అధ్యక్షులు ధరణి కృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రగతిశీల యువజన సంఘం పి వై ఎల్ ఖమ్మం నగరం కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా పి వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ వి రాకేష్ మాట్లాడుతూ
కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టిఆర్ఎస్ ఎన్నికల సమయంలో లో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పిస్తాం అంటూ అధికారంలోకి వచ్చి నేటికీ యువతకు నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పించకపోవడంలో పూర్తిగా విఫలమైందని వికర్శించారు.
కేంద్ర ప్రభుత్వం కోటి ఉద్యోగాలు అంటూ, టిఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 90 వేల ఉద్యోగాలు ఇస్తానంటూ ఎనభై వేల పోస్టులకు నోటిఫికేషన్ లు విడుదల చేసి వీటిని వచ్చే ఎన్నికల వరకు కొనసాగిస్తూ నిరుద్యోగులని మోసం చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వ మోసాలను నిరుద్యోగులు గుర్తించాలని,నిరుద్యోగులకు భృతి ఇస్తానని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదని గుర్తు చేశారు.కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు అన్నిటిని క్రమబద్ధీకరణ చేస్తూ రెగ్యులరైజేషన్ చేస్తానని చెప్పి ఇంతవరకు దాని ముచ్చటే లేదన్నారు.
నిరుద్యోగులు అందరికీ ఉచిత కోచింగ్ ఇస్తానని చెప్పి అది అమలు చేయకపోవడంతో, నిరుద్యోగుల అంతా ప్రవేట్ కోచింగ్ కి వెళ్లి వేలాది రూపాయలు ఇచ్చి, జేబులు ఖాళీ చేయించుకోవాల్సి వస్తుందని అన్నారు.జిల్లాకు కోచింగ్ సెంటర్ అమలుకు నోచుకోలేదని, ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లో వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తుంటే కనీసం అడ్డుకట్ట వేయలేదు అన్నారు.
ఇకనైనా ప్రభుత్వం మేల్కొని నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి 5000 అమలు చేసి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ క్యాలెండర్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల నిరుద్యోగులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పి వై ఎల్ నగర కార్యదర్శి డి చందు, నాయకులు రవీందర్, వెంకటేశ్వర్లు ,రామకృష్ణ ,రవి కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.







