నేలకొండపల్లి ఎస్ ఐ పై తప్పుడు ప్రచారం

నేలకొండపల్లి మండలం కేంద్రంలో కాలనీలో ఆదివారం గణేష్ నిమజ్జనం రోజు జరిగిన ఘటనలో స్థానిక ఎస్ఐ స్రవంతి ఎటువంటి కుల దూషణకు పాల్పడలేదని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుడు సోడేపొంగు ప్రశాంత్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.కాలనిలో ఎస్ఐ వారి సిబ్బంది‌తో వచ్చి డీజే తీసుకు పోతుంటే కమిటీ సభ్యులందరూ అడ్డం తిరిగామన్నారు.

 False Propaganda On Nelakondapally Si ,nelakondapally Si, False Propaganda , Kh-TeluguStop.com

అక్కడ జరిగిన ఆర్గ్యుమెంట్‌లో ఎస్సైకి వివరించే తరుణంలో అప్రయత్నంగా చేయి ఆమెకు తగలడంతో ఎస్ఐ కోపంతో తాగి నాకొడుకుల్లారా ఏం చేస్తున్నారో అర్ధమవుతుందా అని మాత్రమే అన్నారు.కులం పేరు పెట్టి దూషించలేదని తెలిపారు.

ఈ ఘటన సోషల్ మీడియాలో కొందరు నాయకులు ఇన్వాల్ కావడం వల్లే విషయం పెద్దదైందన్నారు.ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని,మావల్ల ఎస్సై ఏదైనా ఇబ్బంది పడితే మేం క్షమాపణ అడగడానికి సిద్ధంగా ఉన్నమన్నారు.

కావాలనే కొంతమంది ఎస్సై మీద దుష్ప్రచారం చేస్తున్నారు.మాకు లేని బాధ వారికెందుకని, మాకు,ఆ కుల రాజకీయాలకు సంబంధం లేదని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube