నూతన మున్సిపల్ కార్పొరేషన్ భవనం నుండే పౌర సేవలు.సకల సౌకర్యాలతో సిద్దం.4ఎకరాల సువిశాలమైన స్థలంలో రూ.22కోట్లతో నిర్మాణం.డివిజన్లో చెత్త సేకరణకై మినీ వ్యాన్(15), ట్రాక్టర్లు(10) ప్రారంభించిన మంత్రి పువ్వాడ.పౌర సేవల ఇక నుండి నూతన కార్యాలయం నుండి పొందాలని మంత్రి విజ్ఞప్తి.ఖమ్మం నగర ప్రజలకు మరింత మెరుగైన పౌర సేవలు అందించేందుకు రూ.22 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయం భవనం నుండే నేటి నుండి పౌర సేవలు అందుబాటులో ఉంటాయని, వాటిని ప్రజలు సద్వినియోగంగించుకొవవాలని ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.విజ్ఞప్తి చేశారు.ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోని డివిజన్లో చెత్త సేకరణకై మినీ వ్యాన్(15), ట్రాక్టర్లు(10) ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.అనంతరం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి ని తన కార్యలయంను అధికార స్థానంలో కూర్చోబెట్టారు.పౌర సేవలకు ఇబ్బంది కలుగకుండా నిత్యం అందుబాటులో అంటు ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.కౌన్సిల్ సమావేశాల నిమిత్తం 150 మంది కూర్చునేందుకు విశాలమైన పెద్ద హల్, డ్యుయల్ కుషన్ సీటింగ్, అధునాతన సౌండ్ సిస్టమ్ , సెంట్రల్ ఏసీ తదితర సౌకర్యాలతో ఎర్పాటు చేసినట్లు చెప్పారు.
గ్రేటర్ హైద్రాబాద్ తరువాత అంతటి విశాలమైనది ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయ భవనం అని వెల్లడించారు.ఇక నుండి మున్సిపాలిటీకి సంబందించిన ప్రతి సేవలు నూతన మున్సిపల్ భవనం నుండే పొందాలని ప్రజలను కోరారు.
మంత్రి వెంట జిల్లా కలెక్టర్ VP గౌతం , మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి , మేయర్ పునుకొల్లు నీరజ , డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార , సుడా చైర్మెన్ బచ్చు విజయ్ , AMC చైర్మన్ లక్ష్మిప్రసన్న గారు, మున్సిపల్ అధికారులు & సిబ్బంది, కార్పొరేటర్లు ఉన్నారు.







