అధికారులందరి సమన్వయ సహకారంతో సబ్-ఇన్స్‌పెక్టర్, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలను విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ పెర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి మరియు JNTUH ఆద్వర్యంలో ఆగస్టు 7వ తేదీన నిర్వహించనున్న ఎస్‌ఐ ప్రిలిమ్స్ రాత పరీక్షల నేపథ్యంలో ఈరోజు కొణిజర్ల మండలం తనికెళ్ళలో గల విజయ ఇంజనీరింగ్ కాలేజ్ లో నిర్వహించిన సంబంధిత అధికారుల సమన్వయ మరియు అవగాహన సదస్సు కార్యక్రమంలో జిల్లా నోడల్ ఆఫీసర్ గా అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ శబరిష్ , జిల్లా రీజినల్ కో-ఆర్డనేటర్ రామచంద్రరావు, విజయ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ రామసుబ్బారెడ్డి ,చీఫ్ సుపర్డెంట్లు, ఇన్విజిలేటర్లు, అబ్జర్వర్స్, బయోమెట్రిక్ టెక్నికల్ బృందాలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ …పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 7వ తేదీన సబ్-ఇన్స్‌పెక్టర్, ఆగస్టు 21వ తేదీన కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీసు నియామక బోర్డు ప్రకటించిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో జరిగే ఈ పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం పకడ్బందిగా బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేపట్టాలని పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు.
ఖమ్మం నగర పరిసరాలలోని 17 సెంటర్లలో 7932 మంది అభ్యర్థులు, సత్తుపల్లిలోని 13 సెంటర్లలో 5303 మంది అభ్యర్థులు ఎస్‌ఐ ప్రిలిమ్స్ రాత పరీక్షలకు హాజరవుతారని తెలిపారు.ఆగష్టు 7 (ఉదయం 10 గంటల నుండి 1:00 గంటల వరకు) పరిక్ష కేంద్రల పరిసర ప్రాంతాలలో ఏలాంటి మైకులు, డిజేలతో ఉరేగింపులు, దర్నలు, అడ్వటైజ్మెంట్, ట్రాఫిక్ ఆంతరాయం కాకుండా, జిరాక్స్ సెంటర్ బంద్ చేసేలా పటిష్టమైన చర్యలు తీసుకొవాలని సూచించారు.
పరిక్ష కేంద్రాలను మూడు రోజుల ముందుగానే సందర్శించి స్ధానిక పరిస్థితులు అంచనా వేసి అవసరమైన బందోబస్తు, భద్రత చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు.
పరిక్ష జరిగే సమయంలో సంబంధిత పరిక్ష నిర్వహణ, పర్యవేక్షణ అధికారులు మినహా పరిక్ష కేంద్రంలోనికి ఎవరికి అనుమతి లేదనే విషయాన్ని పోలీస్ సిబ్బంది గ్రహించాలని సూచించారు.
పోలీస్ సిబ్బంది విధివిధానాలపై పోలీస్ అధికారులు మార్గదర్శకాలు ఇవ్వాలని సూచించారు.
పరీక్ష సమయానికి గంటముందే టెక్నికల్ బృందం అభ్యర్థుల బయోమెట్రిక్, ఫింగర్ ఫ్రంట్స్, ఫోటో ఐడెంటిఫికేషన్ లో పరిశీలించి పరిక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారని తెలిపారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ ,ఏసీపీలు రామోజీ రమేష్ , అంజనేయులు, వెంకటేశ్, రహెమాన్, సిఐలు పాల్గొన్నారు .