తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.ఈ మేరకు లెక్కింపులో అధికారికంగా తొలి ఫలితం వెల్లడైంది.
కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ గెలుపొందారు.
అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వర రావుపై ఆయన విజయం సాధించారు.కాంగ్రెస్ అధికారికంగా ఒక సీటును తన ఖాతాలో వేసుకుంది.
దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు నిర్వహిస్తున్నారు.