వామపక్ష యువజన, మహిళ, విద్యార్థి సంఘాలు పిలుపు మణిపూర్ రాష్ట్రంలో కుకీలు, మైతీ జాతులకు వైరుధ్యాలు సృష్టించి మారణ హోమంగా మార్చిన బిజెపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్), ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యూ), ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు) ఖమ్మం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మనుదగ్ధం చేసి నిరసన తెలియజేయడం జరిగింది.ఈసందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం(పివైఎల్) రాష్ట్ర కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ మాట్లాడుతూగత మూడు నెలలుగా మణిపూర్ లో మారణ హోమం జరుగుతున్నారు.
మే మూడో తేదీన మణిపూర్లో కుకీ తెగకు చెందిన మహిళలను నగ్నంగా ప్రదర్శించి, లైంగిక వేధింపులు చేసి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.దేశ రక్షణలో భాగస్వామిగా ఉన్న భారత దేశ సైనికుని భార్యకు రక్షణ లేని భారతదేశంలో మతోన్మాద బిజెపి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ పాలించే హక్కు లేదన్నారు.
మణిపూర్ రాష్ట్రం రావణ కష్టంలా మార్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటివరకు మాట్లాడకపోవడం సిగ్గుచేటు అన్నారు.మణిపూర్ ఘటనకు నైతిక బాధ్యత వహించి ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి రణబీర్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
2002 గుజరాత్ మారణ హోమాన్ని గుర్తు చేస్తున్నది.ఇండ్లపై దాడులు, కూల్చివేయడం, హత్యలు, సామూహిక అత్యాచారాలు, ప్రార్థనాలయాల కూల్చివేత జరుగుతున్నా కేంద్రం మాట్లాడకుండా చోద్యం చూస్తుందన్నారు.
కుకీ ఆదివాసి మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారానికి హత్యలకు పాల్పడిన వీడియోలు బయటకు వచ్చిన తర్వాత తప్ప మోడీ నోరు విప్పలేదు.అప్పుడు కూడా మూడు నెలలుగా జరుగుతున్న మారణ కాండను ఖండించలేదు.
ఘర్షణలకు కారణమైన విషయం పట్ల తన వైఖరిని ప్రకటించలేదు.అత్యంత వెనుకబడిన కుకి ఆదివాసి తెగ మనుగడకు ఇవ్వాల్సిన భద్రత ను ఇవ్వడం లేదు.
పైగా మైతీ తెగ చేస్తున్న దాడులను చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది.మైతీ తెగలో మెజార్టీగా హిందువులు, కొద్దిగా క్రిష్టియన్లు, ముస్లింలు ఉన్నారు.
కానీ కుకీ తెగలో మొత్తంగా క్రిస్టియన్ లే ఉన్నారు.దీంతో వీరిని లేకుండా చేయడానికి ఇండ్లు ధ్వంసం చేయడం, తగలబెట్టడం, హత్యలు చేయడం, చర్చిలు కూల్చివేయడం, వారు ఉన్న ప్రాంతాల నుండి బయటకు తరిమేయడం చేస్తున్నారు.
మణిపూర్ పోలీస్ సిబ్బంది ఆయుధాలు పెద్ద ఎత్తున మాయమయ్యాయి.రాజధాని ఇంఫాలలో గట్టి బందోబస్తు మధ్య ఉన్న చర్చిని సైతం కూల్చి వేయగల్గడం వెనక ఎవరి అండదండలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు .మణిపూర్ పోలీసులకు సహాయంగా భారత ప్రభుత్వం కేంద్ర బలగాలను పంపినా పరిస్థితి అదుపులోకి రాకపోవడానికి కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమన్నారు.ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గొర్రెపాటి రమేష్, మాదారపు ఉమాశంకర్ ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి లక్ష్మక్క, జానకి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘం జిల్లా కార్యదర్శి జి మస్తాన్ పాల్గొని మాట్లాడారు.
ప్రజాసంఘాల నాయకులు రాధక్క, సైదమ్మ, నాగరాజు, సాగర్, ప్రభు, మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.