అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి :: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్

ఖమ్మం, సెప్టెంబర్ 2: జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ లతో సిఇఓ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 Everyone Who Is Eligible Should Be Given The Right To Vote :: State Chief Electo-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2004 జనవరి ఒకటి నుండి 2004 డిసెంబర్ 31 వరకు జన్మించిన పిల్లల వివరాలను స్థానిక పంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి సేకరించి వారిని నూతన ఓటరుగా నమోదు చేయాలనీ, అదే విధంగా గత సంవత్సరం కాలంలో మరణించిన వారి వివరాలను పంచాయతీ, మున్సిపాలిటీ నుండి సేకరించాలని సూచించారు.పంచాయతీలు, మున్సిపాలిటీల నుండి వచ్చిన జాబితాను బూత్ స్థాయి అధికారుల పరిధి నిర్దేశించి బాధ్యతలు అప్పగించాలని, నూతన ఓటరు నమోదు, మరణించిన వారి తొలగించే ప్రక్రియ చేపట్టాలని ఆయన ఆదేశించారు.

జిల్లాలో ఉన్న స్వశక్తి మహిళా సంఘాలతో బూత్ లెవెల్ స్థాయి అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని, సెప్టెంబర్ 5 నుంచి 9 వరకు సదరు సమావేశాలు ప్రారంభించాలని సూచించారు.జిల్లాలో ఉన్న ప్రతి బూత్ కవర్ అయ్యేలా స్వశక్తి మహిళా సంఘాల సమావేశాలు నిర్వహించాలని సూచించారు.

సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 16 వరకు జిల్లాలో ఉన్న గర్భవతులు, బాలింతలను ఓటరు జాబితాలో నమోదు చేయడం పై శ్రద్ద వహించాలని, ఇందుకు గాను అంగన్ వాడి టీచర్లను, సహాయకులను వినియోగించుకోవాలని ఆయన ఆదేశించారు.జిల్లాలో ఉన్న కళాశాల నుంచి విద్యార్థుల్లో అంబాసిడర్ లను ఏర్పాటు చేసి వారితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని సూచించారు.

జిల్లాలోనీ విద్యా సంస్థల్లో చదువుతున్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని ఆయన ఆదేశించారు.సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 24 వరకు జిల్లాలో ఉన్న ఆసుపత్రులలో ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టాలని, జిల్లాలో ఉన్న వ్యాపారులతో చర్చించి వారి సంస్థలో పని చేస్తున్న వారందరికీ ఓటు హక్కు కల్పించాలని తెలిపారు.

జిల్లాలో ఉన్న దివ్యాంగుల జాబితా సదరం క్యాంపు నుంచి సేకరించి వారి వివరాలను ఓటరు జాబితాలో నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు.జిల్లాలో ఓటరు ప్రాముఖ్యత వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా, డిఆర్వో శిరీష, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, డీఆర్డీవో విద్యాచందన, డిపివో హరిప్రసాద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube