తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థ దేశానికే రోల్ మోడల్: హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ

తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థ దేశానికే రోల్ మోడల్ అని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ ( Mahmood Ali )అన్నారు.ఖమ్మం పోలీసు కమిషనరేట్( Khammam Police Commissionerate ) రూరల్ డివిజన్ రఘునాథపాలెం మండల పరిధిలో 50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్( Puvvada Ajay Kumar ) గారితో కలసి రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ గారు ప్రారంభించారు.

 Telangana Policing System Is A Role Model For The Country: Home Minister Mahmood-TeluguStop.com

ప్రారంభోత్సవ కార్యక్రమంలో MLC తాత మధు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్( VP Gautam ), పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ గారు మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతిభద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు.గత తొమ్మిది ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం స్నేహపూర్వక పోలీసింగ్ తో సహా పోలీసు శాఖలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టిందని కొనియాడారు.తెలంగాణ పోలీసులు అద్భుతమైన పనితీరుతో దేశంలో నెంబర్ వన్ పోలీసింగ్ గా పేరు తెచ్చుకున్నారన్నారు.

తెలంగాణ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించడం ద్వారా అనేక కేసులను చేదించగలుగుతున్నారని చెప్పారు.

తెలంగాణలో మహిళల భద్రత అత్యంత ప్రాముఖ్యత ఇచ్చామని, వారి సమస్యలను పరిష్కరించడానికి, వారికి భద్రత కల్పించడానికి షీ టీమ్స్, భరోసా, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేశామని అన్నారు.

ప్రజలతో మెరుగైన సంబంధాలు ఏర్పరచుకుని వారి సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధించారన్నారు.మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ రఘునాథపాలెం మండలం ఏర్పడిన తరువాత స్ధానిక ప్రజలకు అందుబాటులో వుండేవిధంగా ఒకచోట మండల పరిషత్ కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ నిర్మించడం గర్వించదగ్గ ఆంశమని అన్నారు.

గతంలోజిల్లా కేంద్రానికి దగ్గరలో వున్నప్పటికి రోడ్లు,మంచినీటి సౌకర్యం లేక అభివృద్ధికి ఆమడదూరంలో వుండే రఘునాథపాలెం మండలానికి గడచిన తొమ్మిది ఏళ్లలో రూపురేఖల మార్చి పరిపూర్ణమైన అభివృద్ధి సాధించామని అన్నారు.ఇళ్ల పట్టాల కోసం గత 20 ఏళ్ళుగా ఎదురుచూస్తున్న పోలీస్ అమరవీరుల కుటుంబాలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ,జిల్లా కలెక్టర్ గౌతమ్ చోరవతో 21 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం సంతోషకరమైనదని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ అన్నారు.కార్యక్రమంలో MLA హరిప్రియ, నగర మేయర్ పునుకొల్లు నీరజ,జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కొండబాల కోటేశ్వరరావు, అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్, ట్రైనీ ASP అవినాష్ కుమార్,ZPTC మాలోతూ ప్రియాంక, MPP భుక్యా గౌరీ, సర్పంచ్ గుడిపూడి శారధ, ఏసీపీ భాస్వారెడ్డి, సిఐ రాజీరెడ్ది, ఎస్సై రవి పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube