ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ ఇవాళ పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ మేరకు ముందుగా కొణిజర్ల మండలంలోని అంజనాపురంకు వెళ్లారు మంత్రి కేటీఆర్.అక్కడ పామాయిల్ ఫ్యాక్టరీకి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
అనంతరం ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద నిర్మించిన ఎన్టీఆర్ పార్క్, ఎస్బీఐటీ కళాశాల సమీపంలో మున్సిపల్ స్పోర్ట్స్ అదేవిధంగా గోళ్లపాడు చానెల్ పై నిర్మించిన పార్క్ లు, వీడివోస్ కాలనీలో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లను కేటీఆర్ ప్రారంభించనున్నారు.మంత్రుల పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.







