నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే తగ్గించాలి: పి.ఓ.డబ్ల్యు డిమాండ్

ధరల పెరుగుదలతో సామాన్యుడు బతికే పరిస్థితి లేదని, రోజురోజుకు వ్యాపారం పెరుగుతున్నా పాలకులకు పేదలపై కనికరం లేకుండా పోతుందని పి ఓ డబ్ల్యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి లలిత, సిహెచ్ శిరోమణి ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన పి ఓ డబ్ల్యు జిల్లా కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.

నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల పై నియంత్రణ కోల్పోయి వ్యవహరిస్తోందన్నారు.బ్లాక్ మార్కెట్, కార్పొరేట్ సంస్థలు ఇష్టానుసారంగా దోచుకు తింటున్నా పాలకవర్గాలు పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు.

ఆరు నెలల కాలంలో కొన్ని నిత్యావసర ధరలు రెట్టింపు అయ్యాయని కొన్నింటిని కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని అయినా ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకోవడం లేదని వారు దుయ్యబట్టారు.మోడీ సర్కార్ ప్రజల కోసం కాకుండా కార్పొరేట్ సంస్థల కోసం పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు.

పెంచిన నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలని లేనియెడల పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి ఝాన్సీ, కోశాధికారి శిరీష , నాయకులు ఆవుల మంగతాయి, సిరిపురపు స్వరూప, పుల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
వైరల్ వీడియో : విమానంలో కొట్టేసుకున్న ప్రయాణికులు.. చివరకు..

Latest Khammam News