ఖమ్మం జిల్లా( Khammam District )లోని పలు శాఖల అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి( Minister Ponguleti Srinivas Reddy ) సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలోనే అధికారుల తీరుపై మంత్రి పొంగులేటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులంతా సమన్వయంతో పని చేయాలని సూచించారు.

అదేవిధంగా అవినీతికి పాల్పడితే చూస్తూ ఊరుకోమని తెలిపారు. రెవెన్యూ వ్యవస్థ( Revenue system )ను ప్రక్షాళన చేయడం ప్రభుత్వ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు.అధికారులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.







