పాలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేసిన మంత్రి పువ్వాడ..

నాగార్జునసాగర్‌ రెండో జోన్‌ పరిధిలో ఉన్న ఖమ్మం జిల్లా ఆయకట్టుకు పాలేరు జలాశయం నుంచి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నీటిని విడుదల చేశారు.ఈ సందర్భంగా లాకులు ఎత్తి ఎడమకాలువకు నీటిని విడుదల చేశారు.

 Minister Puvwada Released Water From Paleru Reservoir Details, Minister Puvvada-TeluguStop.com

ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడటం, కృష్ణాపరివాహకం నుంచి ప్రాజెక్టులకు గణనీయంగా నీరు చేరడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ ఆదేశాలతో ముందుగానే సాగర్‌ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు.ఆన్‌ ఆఫ్‌ పద్ధతిలో నీటిని అందించేందుకు అధికారులు తగు ప్రణాళికలు సిద్ధం చేశారు.ఖమ్మం జిల్లాలో సుమారు 2.5లక్షల ఎకరాలు సాగయ్యే అవకాశం ఉందని, ఇదిలా ఉంటే సాగర్‌ మొదటి జోన్‌ నుంచి 2వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో పాలేరు జలాశయం జలకళను సంతరించుకుందన్నారు.23 అడుగుల గరిష్ఠ నీటిమట్టానికి గాను 22అడుగుల మేర నీరు చేరిందని, ఇప్పటికే రైతులు సాగుపనులను ముమ్మరం చేశారు పేర్కొన్నారు.

తుంగభద్ర నుండి నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా నీటి విడుదల కు ఆదేశించారని అన్నారు.

గత ప్రభుత్వ హాయంలో అర tmc కోసం కోట్లాడిన పరిస్థితుల నుండి, నేడు స్వారాష్ట్రలో సంవృద్దిగా సాగునీరు అందిస్తుందని పేర్కొన్నారు.ఎడమ గట్టు వద్ద గల విద్యుత కేంద్రం నుండి విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటూ దిగువకు నీరు అందించడం జరుగుతుందని, తద్వారా దాదాపు 40 రోజుల ముందు మనకు సాగునీరు అందుతుందన్నారు.

గతంలో ఒక్క పంట కూడా తీయాలేని పరిస్థితుల నుండి నేడు రైతులు రెండు పంటలు పండించునే స్ధాయికి చేరుకున్నామన్నారు.

ఇప్పటికే జిల్లా రైతులకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు సంసిద్ధం చేశామని, ఇప్పటికే వాటన్నిటిని నిల్వ చేసుకోవడం జరిగిందన్నారు.

గతంలో విధంగానే కొనుగోలు కేంద్రాలు యధాతథంగా కొనసాగుతుందన్నారు.రాష్ట్రాన్ని కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందన్నారు.

కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ తో పాటు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి , సండ్ర వెంకట వీరయ్య , ఎమ్మెల్సీ తాతా మధు , జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం పాల్గోన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube