ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజికావర్గ పరిధిలోని కాకర్లపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ళ అరవింద్ ఇటీవల ప్రమాదవశాత్తు మరణించారు, వారికి టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సి ఫార్సు మేరకు టిఆర్ఎస్ పార్టీ నుండి రెండు లక్షల రూపాయల టిఆర్ఎస్ పార్టీ ప్రమాద బీమా చెక్కు మంజూరైంది.మంజూరైన చెక్ ను మృతుడు నేరెళ్ల అరవింద్ తల్లి నెరెళ్ళ ఉష చంద్రిక కి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య స్వయంగా వారి ఇంటికి వెళ్లి అందజేశారు.
పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వర రావు గారు, జడ్పిటిసి కూసంపూడి రామారావు గారు ఎంపీపీ దొడ్డా హైమావతి శంకరరావు గారు, సర్పంచ్ కంచర్ల రమాదేవి నాగయ్య గారు, ఎంపీటీసీ పుష్పవతి గారు,గ్రామ కమిటీ దేవరపల్లి సత్యనారాయణ, గ్రామ టి ఆర్ యస్ పార్టీ రైతు కమిటీ చైర్మన్ కొప్పుల రమేష్ గారు, వార్డు సభ్యులు పరిమి వెంకటేశ్వర రావు గారు, మాజీ mpp చల్లారి వెంకటేశ్వర రావు గారు, కుక్కడపు రాంబాబు గారు, పోదిల నరసింహారావు, చీకటి చెన్నరవు గారు, పొదిలి మరేశ్వరారవు గారు తదతరులు పాల్గొన్నారు.







