తెలుగులో బంగారం, వాన సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో మీరాచోప్రా ఒకరు.కెరీర్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాలు లేని ఈ హీరోయిన్ గతంలో ఒక సందర్భంలో ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదని కామెంట్లు చేసి ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఈ నటికి బెదిరింపులు రావడంతో ఈ నటి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
తారక్ అభిమానులను కంట్రోల్ చేయడం లేదని కూడా ఆమె కామెంట్లు చేశారు.
అయితే ఆ తర్వాత ఈ గొడవను ఎన్టీఆర్ అభిమానులు మరిచిపోయారు.ప్రస్తుతం మీరాచోప్రా ఒక ట్వీట్ చేయగా ఆ ట్వీట్ ఎన్టీఆర్ అభిమానులను రెచ్చగొట్టేలా ట్వీట్ చేశారు.
బహుబలి సిరీస్ సినిమాల ద్వారా ప్రభాస్, పుష్ప సినిమా బన్నీ, ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా చరణ్ తారక్ లకు, కేజీఎఫ్ ఛాప్టర్1 ద్వారా యశ్ కు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు దక్కింది.
ఈ స్టార్ హీరోల ఫ్యూచర్ ప్రాజెక్టులు సైతం పాన్ ఇండియా ప్రాజెక్టులుగా తెరకెక్కనున్నాయి.అయితే మీరా చోప్రా తాజాగా ట్విట్టర్ లో చేసిన ట్వీట్ లో సౌత్ ఇండియా యాక్టర్లకు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు రావడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని ఆయా హీరోల టాలెంట్, హ్యూమిలిటీ, ఫ్యాషన్ ను నేర్చుకోవాలంటూ ప్రభాస్, బన్నీ, చరణ్, యశ్ లకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ లను మీరా చోప్రా ప్రస్తావించారు.
అయితే టాలెంటెడ్ యాక్టర్ అయిన ఎన్టీఆర్ హ్యాష్ ట్యాగ్ లేకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు కూడా మీరాచోప్రా పనికిరారని అలాంటి వాళ్లకు అటెన్షన్ ఇవ్వవద్దని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు.ఎన్టీఆర్ గురించి ప్రశంసిస్తూ పలువురు బాలీవుడ్ హీరోయిన్లు కామెంట్లు చేసిన వీడియోల ద్వారా మీరా చోప్రా ట్వీట్ కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఘాటుగా బదులిస్తున్నారు.