ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం( పిడిఎస్యు) ప్రగతిశీల యువజన సంఘం (పి వై ఎల్ )జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక జడ్పీ సెంటర్ మీదుగా ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించడం జరిగింది.అనంతరం నిరసన కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం జిల్లా అధ్యక్షులు గొర్రెపాటి రమేష్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి డి ఎస్ యు)జిల్లా అధ్యక్షులు క్రాంతి అధ్యక్షతన సంఘం జిల్లా కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ,గోకిన పల్లి మస్తాన్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగి నిరుద్యోగ యువతీ యువకులు ఆత్మహత్యల వైపు దారి తీస్తున్నారని ఖాళీగా ఉన్న అన్ని శాఖలలో ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ప్రధాన సమస్య గ్రంథాలయం దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యువతీ యువకులకు మౌలిక మైనటువంటి వసతులు లేక అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తక్షణమే ఆ సమస్యను పరిష్కరించాలని నిరుద్యోగ యువకులకు అసెంబ్లీ సాక్షిగా 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కెసిఆర్ చెప్పి నేటికీ వాటిపై నోటిఫికేషన్లు వేయకుండా కాలం గడుపుతున్నారని,నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నేటికి అమలు చేయలేదని తక్షణమే నిరుద్యోగ భృతి అమలు చేయాలని జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై ఫీజులను విధిగా నియంత్రించాలని వారు అన్నారు జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చెయ్యాలని మన ఊరు మన బడి ఇలాంటి కార్యక్రమాలు ని జిల్లాలో అన్ని పాఠశాలలకు వర్తింప చేయాలని జిల్లా కేంద్రంలోని కోచింగ్ సెంటర్లలో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నటువంటి కోచింగ్ సెంటర్లపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వారు కోరినారు ఈనెల 23న నిరుద్యోగ సమస్య మీద చలో ప్రగతి భవన్ కార్యక్రమం ముట్టడిని జయప్రదం చేయాలని వారు మాట్లాడుతూ రానున్న కాలంలో అన్ని శాఖలలో ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి ఉద్యోగ ఖాళీలను పూర్తి చేసేంతవరకు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తామని రేపు జరగబోయే నిరుద్యోగ ప్రగతి భవన్ ముట్టడికి విద్యార్థి యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాముల మోహన్ రావు ,జిల్లా నాయకులు బేతంపూడి నాగరాజు ,ఉమా శంకర్ ,గుడి చుట్టూ గోపి ,బద్రి, శ్రీహరి, వంగూరి రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు