భవన నిర్మాణ కార్మిక సంఘం మహాసభను జయప్రదం చేయండి: ఇప్ట్యూ పిలుపు

తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఇప్ట్యూ అనుబంధం ఖమ్మం జిల్లా 3 వ మహాసభలను జూన్ 1 వ తారీఖు నాడు ఖమ్మం పట్టణంలో నిర్వహిస్తున్న సందర్భంగా ఖమ్మం పట్టణంలోని బైపాస్ రోడ్ లో కరపత్రాల ఆవిష్కరణ మరియు ప్రచారం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఇప్ట్యూ ఖమ్మం జిల్లా అధ్యక్షులు షేక్ సుభాహన్ పాల్గొని మాట్లాడుతూ ఈ దేశంలో వివిధ రంగాలలో 40 కోట్ల మందికి పైగా కార్మికులు పని చేస్తా ఉన్నారాని,కానీ ఆ కార్మికుల పట్ల ప్రభుత్వాలు ముసలి కన్నీరు కారుస్తు సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నరాని నరేంద్ర మోడీ ప్రభుత్వన్ని విమర్శించారు.

ఈ తరుణంలో తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా 3 వ మహాసభను ఖమ్మం పట్టణంలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.ఈ మహాసభ ముఖ్య ఉద్దేశం దేశంలో సుమారు 90 లక్షల మంది కార్మికులు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారాని వారికీ సంక్షేమ బోర్డు ద్వారా రావాల్సినటువంటి బెనిఫిట్ లు పని ప్రదేశంలో జరిగిన ప్రమాదాలు,వివాహ కానుకలు, ప్రసూతి కానుకలు తదితర బెనిఫిట్ లా కోసం కార్మికులు అప్లై చేసుకొని ఉన్నారని, కానీ అధికారుల నిర్లక్ష్యం వలన సంక్షేమ బోర్డు కార్యలయాలలో ఆలస్యం జరుగుతుందని వాటిని వెంటనే పరిష్కరించే విధంగా ఉద్యమ కార్యచరణను ఈ మహాసభలో ప్రకటిస్తామని అన్నారు.

అదేవిధంగా చనిపోయిన కార్మికులకు 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం చెల్లించాలని, చనిపోయిన కార్మిక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని భవిష్యత్ కార్యాచరణలు ఈ మహాసభలో తీర్మానం చేయబోతున్నట్లుగా వారు తెలిపారు.ఈ మహాసభకు కార్మికులు అధిక సంఖ్యలో వచ్చి జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు.

ఈ కార్యక్రమంలో ఇఫ్ట్ జిల్లా నాయకులు గౌని మోహన్ రావు, గోగులోత్ పటేల్, బోడ నాగేశ్వరరావు, బ్రహ్మం, జి శ్రీను, సైదులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
హీరోయిన్ సాయిపల్లవి మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా.. ఆమె జవాబు ఇదే!

Latest Khammam News