ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ రెండోవ ఛార్జిషీట్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.మద్యం కుంభకోణం కేసులో ఈడీ తయారు చేసిన ఛార్జిషీట్ మొత్తం కల్పితమని చెప్పారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలను బెదిరించడమే ఈడీ పనిగా పెట్టుకుందని కేజ్రీవాల్ విమర్శించారు.అవినీతికి వ్యతిరేకంగా ఈడీ పనిచేయడం లేదన్న ఆయన ప్రభుత్వాలను కూల్చడానికి మాత్రమే పని చేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అయితే మద్యం కుంభకోణంలో కేసులో ఈడీ రెండో ఛార్జ్ షీట్ లో పలువురు కీలక వ్యక్తుల పేర్లను చేర్చిన విషయం తెలిసిందే.వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంటతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేర్లను కూడా ఈడీ చేర్చింది.