ఆకర్షణీయమైన లుక్‌తో ఇయర్ బడ్స్.. ధర కేవలం రూ.900లు మాత్రమే

భారతదేశంలో pTron సంస్థ సరికొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ అయిన Basspods Encoreని విడుదల చేసింది.ఈ ఇయర్‌బడ్‌లు ఫిబ్రవరిలో ప్రారంభించబడిన Bassbuds Zenని పోలి ఉంటాయి.

 Ear Buds With An Attractive Look.. Price Is Only Rs.900 , Ear Buds , Technology-TeluguStop.com

బాస్‌పాడ్స్ ఎన్‌కోర్( Basspods Encore ) సౌకర్యవంతంగా, ఎక్కువసేపు ఉపయోగించేందుకు అనుకూలంగా ఉంటాయి.ఇవి నాయిస్ ఫ్రీ టెక్నాలజీ కలిగి ఉన్నాయి.

రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా స్పష్టంగా ధ్వని నాణ్యతను అందిస్తుంది.ఇంటర్నల్‌గా TruTalk™ ENC సాంకేతికతను అమర్చారు.

ఇవి 50 గంటల సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటాయి.ఛార్జింగ్ కేస్‌లో రీఛార్జ్ చేయవచ్చు. బ్లూటూత్ 5.3, టచ్ కంట్రోల్, వాయిస్ అసిస్టెంట్‌(Voice Assistant )ను సపోర్ట్ చేస్తాయి.వీటిని వాటర్ రెసిస్టెంట్‌గా రూపొందించారు.

డిజైన్ పరంగా ఇవి చాలా బాగుంటాయి.స్టైలిష్ లుక్‌తో యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి.10 మీ పరిధితో BT v5.3 బ్లూటూత్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.క్వాడ్ మైక్ + ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ట్రూటాక్ టెక్నాలజీ( Noise Cancelling ) ఇందులో ఉంది.ఛార్జింగ్ కేసుతో 50 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది.400mAh బ్యాటరీ అమర్చారు.టైప్-సి కేబుల్ ద్వారా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.ఒక్కో ఇయర్‌బడ్‌కు 4.5 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది.ఈ ప్రొడక్ట్‌పై కంపెనీ 1 సంవత్సరం వారంటీ అందిస్తోంది.pTron Basspods Encore మిడ్‌నైట్ బ్లాక్, నియాన్ బ్లూ గ్రాఫైట్ బ్లాక్ కలర్స్‌లో వస్తుంది.

పరిమిత కాలం వరకు దీనిని రూ.899కే కంపెనీ అందిస్తోంది.ఆ సమయం ముగిసిన తర్వాత దీనిని రూ.1199 పెట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.ఇది నేటి నుండి ఫ్లిప్‌కార్ట్ తో పాటు కంపెనీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

దీనికి కంపెనీ ఒక ఏడాది వారంటీ ఇస్తుండడంతో చాలా మంది దీనికి ఆకర్షితులవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube