ఎంతో మంది ప్రవాసీయులు తమ తమ దేశాలని విడిచి కార్మికులుగా దుబాయ్ వంటి దేశాలకి వలసలు వెళ్తుంటారు అక్కడ భావన నిర్మాణంలో మరియు వివిధ రంగాలాలో కార్మికులుగా పని చేస్తూ ఉంటారు.ముఖ్యంగా ఇలా కార్మికులుగా వెళ్ళే వారిలో ఎక్కువగా మంది భారత దేశం తరుపున వెళ్తూ ఉంటారు.
అయితే ఈ క్రమంలో ఎంతో మంది అక్కడ అనేక ప్రమాదాల వలన మరణించడం లేయా శారీరకంగా అవయవాలని కోల్పవడం జరుగుతోంది .ఈ విషయంపై లోతుగా ఆలోచించిన దుబాయ్ ప్రధాని కీలక నిర్ణయం ప్రకటించారు.
వలస కార్మికుల కోసం కొత్తగా ఇన్సూరెన్స్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చిందిఅ…గతంలో ఎన్నో పధకాలు ఉన్నా సరే అవి సంవత్సర కాలంలో ఎక్కువగా ప్రీమియం కట్టవలసి వచ్చే సమయానికి వారి యజమాన కంపెనీలు అధిక సొమ్ము చెల్లించేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదని కెబినేట్ అభిప్రాయపడింది…అందుకుగాను ప్రవాసుల కోసం ప్రధాని సరికొత్త పాలసీ కి ఓటు వేశారని తెలుస్తోంది.
కంపెనీలకి నష్టం లేకుండా ప్రీమియం మూడు ధరమ్స్ నుంచి ఆరవై ధరమ్స్కు తగ్గించింది.విదేశాల నుంచి వలస వచ్చే కార్మికుల భద్రతా ఆరోగ్య భద్రతా, ప్రాణ రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రీమియం తగ్గించామని అందువల్ల ప్రతి కంపెనీ విదేశీ వలసకార్మికులను ఈ పథకంలో చేర్చాలని కెబినేట్ సూచించింది.రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం వలస కార్మికులకి ఈ పధకం అందించింది…అయితే ఈ విధానం వలన ఎంతో మంది భారత ప్రవాసీ కార్మికులు లాభాపడనున్నారు.